Junior NTR: ప్రస్తుతం మద్యం, ధూమపానం, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు ఎక్కువ అయ్యాయి. వీటి వాడకం రోజు రోజుకు పెరుగుతుంది. యువత మంచికంటే చెడుకు ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు అనడానికి ఇదే నిదర్శనం. అయితే కొన్ని ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఎక్కువగా మాదకద్రవ్యాలు ఉండవద్దని కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కానీ మరికొన్ని మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అయితే ఈ విషయంపై రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. ఇందులో భాగంగా జూ. ఎన్టీఆర్ తమ వంతుగా యువతను ఓ వీడియో ద్వారా మేల్కొలిపే ప్రయత్నం చేస్తున్నారు.
తాత్కాలిక ఆనందాలు, క్షణకాలపు ఒత్తిడి నుంచి బయటపడాలని చాలా మంది డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు. ఇలా డ్రగ్స్ బారిన పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని యంగ్ టైగర్ ఎన్టీఆర్ సూచించారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలి అంటే ఆయన పిలుపునిచ్చారు. డ్రగ్స్ కు ఆకర్షితులై ఎంతో మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలా చేసుకోవద్దని ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందులో భాగంగా డ్రగ్స్ రహిత తెలంగాణ పై యాంటీ నార్కోటిక్ టీంకు సహకరిస్తున్నారు ఎన్టీఆర్. ఈ క్రమంలో తనవంతు బాధ్యతగా ట్విట్టర్ వేదికగా ప్రత్యేకంగా ఓ వీడియోను విడుదల చేశారు తారక్. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని.. క్షణికమైన ఒత్తిడి, సహచరుల ప్రభావం వల్ల డ్రగ్స్ కు బానిసలు కావద్దని తెలిపారు ఆయన. డ్రగ్స్ రహతి సమాజం కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని కోరారు.
దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంటుందని.. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమో.. క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడడం కోసమే కొందరు డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారన్నారు. మరికొందరు సహచరుల ప్రభావం వల్లనో, స్టైల్ కోసమే.. మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు అవుతున్నారన్నారు. జీవితం చాలా విలువైనదని.. రండి నాతో చేతులు కలపండి అంటూ తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తోన్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా.. కొనుగోలు చేస్తున్నా.. వినియోగిస్తున్నా.. వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం అందించాలని తారక్ వీడియోలో చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైంది. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 27న తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలోనూ రిలీజ్ కావడానికి సిద్దం అయింది. కొద్ది రోజులుగా దేవర చిత్రయూనిట్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. కొరటాల శివ దేవరకు దర్శకత్వం వహించారు. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read More