Bride and groom Meeting: పెళ్లంటే నూరేళ్లు పంట. పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా సరే పెద్ద తతంగమే. డబ్బులు చాలా కావాల్సిందే. ఒకప్పుడు బంధువుల, సంతోషం, ఆనందం మధ్య జరిగేవి పెళ్లిల్లు. కానీ ఇప్పుడు మాత్రం ఆడంబరాలు, డబ్బు మధ్య జరుగుతుంది. ఇక వరుడు, వధువు వారికి సపరేట్ విధివిధానాలు ఉంటాయి. పెళ్లి మాత్రం ఒకే దగ్గర జరుగుతుంది. పెళ్లి తర్వాత రోజు అంటే రిసెప్షన్ వరుడు ఇంట్లో జరిగేది. కానీ ఇప్పుడు ఒకటే రోజు అన్ని కానిచ్చేస్తున్నారు. ఖర్చు కూడా వరుడు, వధువు ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు. అయితే పెళ్లి కుదిరిన తర్వాత కొన్ని విషయాల పట్ల ఇద్దరు జాగ్రత్త వహించడం అవసరం లేదా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది.
చాలా పెళ్లిల్లలో గొడవలు కామన్ గా జరుగుతున్నాయి. ఫుడ్, మర్యాదలు, డెకరేషన్ వంటి వాటి దగ్గర కూడా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇలాంటి గొడవలు జరగవద్దు అంటే కొన్ని విషయాల్లో జాగ్రత్త పడటం చాలా అవసరం అంటున్నారు నిపుణులు. ఇప్పుడు పెళ్లి కుదిరితే ముందుగా వధువు వరుడు వారి ఇష్టాఇష్టాల గురించి కలిసి మాట్లాడుకోవడం చాలా మంచిది. వారి అభిరుచులను కూడా ముందుగానే మాట్లాడుకుంటారు కొందరు. ఒకరి గురించి ఒకరు పెళ్లికి ముందే తెలుసుకుంటున్నారు. ఇలా అన్ని తెలుసుకునే సమయంలోనే పెళ్లి ఏ విధంగా చేసుకోవాలి? ఖర్చు వంటి విషయాల గురించి కూడా మాట్లాడుకోవాలి.
పెళ్లి సమయంలో గొడవలు జరగకుండా, విబేధాలకు తావు ఇవ్వవద్దు అంటే చర్చ అవసరం. ఎందుకంటే పెళ్లి విషయంలో ఆర్థిక విషయాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే వీటికి సంబంధించిన అంశాలను ముందుగానే మాట్లాడుకోవాలి. ఇప్పటి పెళ్లిల్లు మధ్యతరగతి వారికి భారంగానే ఉంటున్నాయి. ఇక మీ ఇంటి గురించి, ఖర్చు గురించి, డబ్బు గురించి మీకు తెలుసు కాబట్టి ఎదుటి వారి గురించి వారి ఆలోచనల గురించి మా ట్లాడుకోవాలి. ఒక నిర్ణయానికి ముందే రావాలి. స్పష్టతతోనే పెళ్లి ప్రణాళిక చేసుకోవాలి.
Also Read: గాలి తగిలేలా స్ట్రగ్. మరి ఎద పరువాల ప్రదర్శన ఈ రేంజ్ లోనా? కుర్రకారు తట్టుకుంటారా?
ఏ ఖర్చులు ఎవరు చూసుకోవాలి? పెట్టిపోతలు ఏంటి? ఫుడ్? ఎంత మంది వస్తారు? వంటి వివరాలు ముందుగానే క్లారిటీ తెచ్చుకోవాలి. కూర్చొని చర్చించుకోవాలి. ప్రీ వెడ్డింగ్ షూట్లు, హల్దీ, మెహందీ అంటూ చాలా ఖర్చు చేస్తున్నారు. మీకు కూడా ఇలాంటి కొన్ని కోరికలు ఉంటే మీకు స్తోమత ఉంటే కలిసి కూర్చొని గొడవ రాకుండా చర్చించుకోండి. ఏ ఫంక్షన్ ఎవరు చేయాలి? ఎక్కడ చేయాలి? ఎవరు చూసుకోవాలి? ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి వంటి వాటి గురించి కూడా మాట్లాడుకుంటే అసలు గొడవ రాదు. సో డోన్ట్ వర్రీ. బీ హ్యాపీ డియర్ కపుల్స్.
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.