Maruti Suzuki: దేశంలో కార్ల ఉత్పత్తిలో మారుతి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో కంపెనీ భారీ డిస్కౌంట్లను ఎక్చేంజ్ ఆఫర్లు ఇచ్చి వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తృతం చేసుకునే దశలో మారుతి తనదైన రీతిలో ఆఫర్లు ప్రకటించి వినియోగదారులను ఆకర్షిస్తోంది. దీంతో కార్ల అమ్మకం పెరిగేందుకు దోహదం చేస్తోంది. కార్ల విక్రయాలు పెరిగితేనే ఆదాయం సమకూరుతుందని కంపెనీ ఆలోచన.

మారుతి సుజుకి జులై నెలలో భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. వివిధ మోడల్స్ లో ఈ నెలాఖరు వరకు ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. దీంతో మారుతి కంపెనీ తన అమ్మకాలను పెంచుకునే క్రమంలో ఆఫర్లు ఇస్తోంది. దీంతో కార్ల అమ్మకాల్లో వేగం పుంజుకోవాలని ఆశిస్తోంది. భారీ డిస్కౌంట్లు, నగదు ప్రోత్సాహకాలు, కార్పొరేట్, ఎక్చేంజ్ బోనస్ లు అందిస్తోంది. ఈ మేరకు కార్ల విక్రయాల్లో పురోగతి సాధించి తద్వారా ఉత్పత్తిని పెంచుకోవాలని భావిస్తోంది.
Also Read: Bandi Sanjay- Etela Rajender: బండి సంజయ్ సీటుకు ఈటల ఎసరు పెడుతున్నారా?
దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ మారుతి వేగనార్. ప్రస్తుతం విరివిగా అమ్ముడవుతోంది. దీనిపై భారీ ఆఫర్ ప్రకటించింది. రూ.74 వేల తగ్గింపుతో భారీ ఆఫర్ ఇస్తోంది. దీంతో ఈ బ్రాండ్లు అధికసంఖ్యలో అమ్ముడవుతున్నాయి. కంపెనీ ప్రకటించిన ఆఫర్ ను సద్వినియోగం చేసుకుని వినియోగదారులు ఊరట పొందుతున్నారు. కంపెనీ అందించే ఆఫర్లను ఉపయోగించుకుని కార్లు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.

మారుతి ఆల్టో 800పై రూ.31 వేల తగ్గింపు ప్రకటించింది. మారుతి ఈ సబ్ కాంపాక్ట్ సెడాన్ పై రూ. 34 వేల తగ్గింపు అందిస్తోంది. మారుతి సెలెరియాపై రూ. 51 వేల తగ్గింపు ఇస్తోంది. మారుతి ఈ మోడల్ పై రూ.31 వేల తగ్గింపును ఇవ్వాలని భావించింది. దీంతో మారుతి సుజుకి కంపెనీ అందిస్తున్న ఆఫర్లతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు అందివచ్చిన అవకాశాన్ని వాడుకుని భారీ డిస్కౌంట్లను వినియోగించుకుని కారు కొనుక్కోవాలనే కలను నిజం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read:Banners on Hyd wall: బీజేపీ సమావేశం తర్వాత హైదరాబాద్ గోడలపై బ్యానర్లు.. వైరల్