Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan: జగన్ ఎమోషనల్, సెంటిమెంట్ అస్త్రాలు... టీడీపీపై ధనిక ముద్ర

CM Jagan: జగన్ ఎమోషనల్, సెంటిమెంట్ అస్త్రాలు… టీడీపీపై ధనిక ముద్ర

CM Jagan: తెలుగుదేశం పార్టీ మూలాలను దెబ్బతీసేందుకు జగన్ సరికొత్త ప్లాన్ తో ముందుకొస్తున్నారు. టీడీపీకి ఇన్నాళ్లూ అండగా నిలుస్తున్న బడుగు బలహీనవర్గాలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జగన్ ప్రధాన ప్రతిపక్షం టీడీపీని దెబ్బతీసేందుకు ఎన్నిరకాల ప్రయత్నాలు చేయాలో అన్నిరకాలుగా చేస్తున్నారు. ఇప్పుడున్న సీట్లను రాకుండా చేయాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బతీసేలా టీడీపీ పెత్తందారి పార్టీ అన్న ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్వం గ్రామాల్లో పెత్తందార్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారు. బడుగు బలహీనవర్గాలను ఎదగనిచ్చేవారు కాదు. ఇప్పుడు చంద్రబాబు, టీడీపీ నాయకులు అదే మాదిరిగా వ్యవహరిస్తున్నారని.. పేదలకు పథకాల నుంచి దూరంచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ.. మరోసారి చంద్రబాబు అధికారంలోకి వస్తే పెత్తందారి వ్యవస్థ అమల్లోకి వస్తుందని జగన్ గుర్తుచేస్తున్నారు.

CM Jagan
CM Jagan

పథకాలు దూరమవుతాయని..
చంద్రబాబు కానీ అధికారంలోకి వస్తే పథకాలు దూరమవ్వడం ఖాయమని ఒకరకమైన ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేయడంతో పాటు సెంటిమెంట్ అస్త్రాన్ని సంధిస్తున్నారు. ప్లీనరీ వేదికగా అధికారంలో నిలబెట్టుకోవడంతో పాటు 175 సీట్లు గెలుపొండం వైసీపీకి అసాధ్యం కాదంటూ టీడీపీకి సవాల్ విసిరారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సొంత పార్టీ నాయకులకు పిలుపునివ్వడంతో పాటు తన ఓటు బ్యాంకు గురించి స్పష్టతనిచ్చారు. లక్షల కోట్ల రూపాయలు నగదు బదిలీ చేశాను కనుక.. తనకు కాకపోతే ప్రజలకు ఎవరు మద్దతిస్తారని కూడా దీమాతో ఉన్నారు. ప్రతీ ఇంటికీ లక్షలాది రూపాయల లబ్ధి చేకూర్చానని.. వారు ఎట్టి పరిస్థితుల్లో తనకు అండగా నిలుస్తారని చెబుతున్నారు. అయితే మొత్తానికి తన ఓటు బ్యాంకు ఏదో స్పష్టతనిచ్చిన జగన్ దానిని పదిలపరచుకునేందుకు ఎమోషనల్, సెంటిమెంట్ ను పండిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారు చేజారకుండా జాగ్రత్త పడుతున్నారు. తాను తప్పించి చంద్రబాబు వస్తే పథకాలు దూరం కావడం ఖాయమని కొత్త పల్లవి అందుకున్నారు. టీడీపీ ధనికుల పార్టీగా అభివర్ణిస్తున్నారు.

Also Read: Bandi Sanjay- Etela Rajender: బండి సంజయ్ సీటుకు ఈటల ఎసరు పెడుతున్నారా?

మానసికంగా సిద్ధం చేసేందుకు..
జగన్ ముందస్తుగానే ఓటర్లను మానసికంగా సిద్ధం చేసే పనిలో పడ్డారు. వలంటీర్లతో ఇప్పటికే ప్రచారం చేయిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తేనే పథకాలు ఉంటాయని.. లేకుంటే మాత్రం కష్టమేనని చెప్పిస్తున్నారు. అయితే ఇది కొంతవరకూ వర్కవుట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఫార్ములాతోనే జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. అప్పట్లో పథకాలు నిలిచిపోతాయని బెదిరించడం వల్లే ఇష్టం లేకున్నా చాలామంది అధికార పార్టీ మద్దతుదారులకు ఓటు వేశారు. అయితే ఇప్పుడు నేరుగా సీఎం పథకాలు నిలిచిపోతాయని ప్రజలకు సావదాన రీతిలో చెబుతున్నా.. హెచ్చరిస్తున్నట్టే. తాను అధికారంలో ఉన్న వరకూ పథకాలు అందుతాయని చెప్పడం ద్వారా ఓ విధమైన హెచ్చరిక సంకేతాలు పంపినట్టేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అదే సమయంలో పథకాలకు అప్పులు చేస్తున్న విషయం, పన్నులు, చార్జీల పెంపు విషయమై ఎటువంటి స్పష్టత లేదు. ప్రజల కూడా వాటిని పట్టించుకోవడం లేదని.. కేవలం తాను పంచిన నగదును మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారని జగన్ నమ్ముతున్నారు. అయితే ప్రజలు, సంక్షేమ లబ్ధిదారులు మాత్రం విషయాన్ని గ్రహిస్తే మాత్రం జగన్ కు నష్టం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.

CM Jagan
CM Jagan

అయినా అనుమానం..
అయితే తాను ప్రకటంచిన సంక్షేమ పథకాలపై జగన్ కూడా ఓ రకమైన అనుమానం అయితే ఉంది. తాను పంచిన నగదు కంటే ప్రజలు అభివ్రుద్ధికే మద్దతిస్తే మాత్రం తనకు నష్టం జరగడం ఖాయమని భావిస్తున్నారు. సంత్రుప్తి పడితే ఇట్టే గట్టెక్కిపోతానని దీమాతో ఉన్నారు. ప్రస్తుతం వైసీపీ సర్కారుపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. అటు సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్న వారు సైతం ప్రభుత్వంపై పెదవి విరుస్తున్నారు. విద్యాధికులు ప్రభుత్వం చేస్తున్న రుణాలపై అవగాహన ఉంది. పన్నులు, చార్జీల వసూలును తప్పు పడుతున్నారు. అయితే దిగువ స్థాయిలో మాత్రం ప్రభుత్వ చర్యపై కొంతవరకూ సంత్రుప్తి ఉంది. ఎన్నికల వరకూ దానిని పదిలపరచుకునేందుకు జగన్ ఎమోషనల్, సెంటిమెంట్ నే నమ్ముకుంటున్నారు.

Also Read:Banners on Hyd wall: బీజేపీ సమావేశం తర్వాత హైదరాబాద్ గోడలపై బ్యానర్లు.. వైరల్

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular