Bandi Sanjay- Etela Rajender: బీజేపీలో అంతర్మథనం కొనసాగుతోంది. నేతల్లో విభేదాలు పొడచూపుతున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల వరకు అవి మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొద్ది రోజులుగా వేములవాడ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వేములవాడ నుంచిపోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో కీలక నేత తుల ఉమ కూడ ఇదే నియోజకవర్గంపై పట్టు పడుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా తాను మాత్రం వేములవాడ నుంచే పోటీకి దిగాలని ప్రయత్నిస్తున్నందున ఏం జరుగుతుందనే దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.

తుల ఉమ మాజీ మావోయిస్టు. ఆమె మొదట టీఆర్ఎస్ లో చేరి జెడ్పీ చైర్ పర్సన్ చేసినా గత ఎన్నికల్లో ఆమెకు టికెట్ కేటాయించలేదు. దీంతో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సారి ఎలాగైనా వేములవాడ టికెట్ తనకే కేటాయించాలని కోరుతున్నా అధిష్టానం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. పైగా ఆ స్థానం బండి సంజయ్ ఆశిస్తున్నందున దానిపై ఇప్పుడే ఏం చెప్పలేమని నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ ని కాదని తుల ఉమకు సీటు ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది. కానీ ఆమె మాత్రం నియోజకవర్గంలో పర్యటిస్తూ తానే ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పడం గమనార్హం.
Also Read: Rohit Sharma: టీమిండియా బ్యాక్ బోన్ అతడేనా? కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన కామెంట్లు
మరోవైపు తుల ఉమకు ఈటల రాజేందర్ గట్టి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే తుల ఉమ నియోజకవర్గంల విరివిగా పర్యటిస్తున్నట్లు సమాచారం. కానీ మెత్తానికి తెలంగాణలో భలే రాజకీయం కొనసాగుతోందని తెలుస్తోంది. బండి సంజయ్ కు ఈటల రాజేందర్ కు మధ్య కొన్నాళ్లుగా మాటలు లేవు. దీంతోనే తుల ఉమను రంగంలోకి దింపి అక్కడి నుంచి పోటీ చేయించాలని ఈటల ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు సక్సెస్ కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ బండి సంజయ్ భుజం తట్టి శభాష్ అనడంతో సంజయ్ ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈ పరిస్థితుల్లో సంజయ్ ఏది అడిగినా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సంజయ్ వేములవాడ సీటు అడిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కానీ ఈటెల కూడా తన మాటగా తుల ఉమకు మాటిచ్చి వచ్చే ఎన్నికల్లో నిలబెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read:Ind Vs Eng Pant: అడ్డొచ్చిన ఇంగ్లండ్ బౌలర్.. పంత్ కి రోహిత్ సరదా కోచింగ్.. వైరల్
[…] Also Read: Bandi Sanjay- Etela Rajender: బండి సంజయ్ సీటుకు ఈటల ఎసరు… […]
[…] Also Read: Bandi Sanjay- Etela Rajender: బండి సంజయ్ సీటుకు ఈటల ఎసరు… […]