https://oktelugu.com/

Film Industry: పైరసీ వల్ల 22,400 కోట్లు నష్టపోయిన ఇండస్ట్రీ…దీనిని అరికట్టే వాళ్ళు లేరా..?

సినిమా ఇండస్ట్రీలో సినిమా తీయడం ఓకేతైతే దానిని సక్సెస్ ఫుల్ గా నిలపడం మరొక ఎత్తు...ఇక ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో సినిమా సక్సెస్ అయిన కానీ ప్రస్తుతం ఉన్న పైరసీ వల్ల ప్రొడ్యూసర్స్ కి లాభాలు వస్తాయా? రావా అనేది కూడా క్లారిటీగా తెలియడం లేదు. కాబట్టి ఒక సినిమా విషయంలో ఏం జరుగుతుంది అనేది ఎవరు ఎస్టిమేట్ చేయలేకపోతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 28, 2024 12:22 pm
    Film Industry

    Film Industry

    Follow us on

    Film Industry: సినిమా ఇండస్ట్రీలో ఒక దర్శకుడు తెలివితేటలను ఉపయోగించి చాలా మంచి కథలను రాస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవాలని అహర్నిశలు కష్టపడుతుంటాడు. ఒక ప్రొడ్యూసర్ బిజినెస్ ని భారీ రేంజ్ లో విస్తరించుకొని ప్రాఫిట్స్ భారీగా రాబట్టాలనే ఉద్దేశ్యంతో ఉంటాడు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరూ కలిసి చేసే ఈ ప్రయత్నంలో సినిమా సక్సెస్ అయితే పర్లేదు. ఒకవేళ ఫెయిల్యూర్ అయితే మాత్రం భారీ నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది.నిజానికి కొన్ని సినిమాలు సక్సెస్ అయిన కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఆ సినిమాలకు రావాల్సినంత గుర్తింపు అయితే రావడం లేదు. ఎందుకు అంటే ప్రేక్షకుడు థియేటర్ కి రాకుండానే పైరసీలో ఆ సినిమాలను చూసి ఎంటర్ టైన్ అవుతున్నారు. దీని ద్వారా సినిమా తీసిన వారికి చాలా లాసెస్ అయితే వస్తున్నాయి.

    2023 వ సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీకి కేవలం పైరసీ వల్ల 22,400 కోట్ల వరకు నష్టం వాటిల్లింది… నిజానికి దీని మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం గాని సినిమా ఇండస్ట్రీ తరపున ఉన్న పెద్దలు గాని చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికి వాళ్లు కూడా ఈ పైరసీని అరికట్టలేకపోతున్నారు. కారణం ఏదైనా కూడా పైరసీ సినిమాల వల్ల సినిమా అనేది చచ్చిపోతుందనే చెప్పాలి. నిజానికి ఒక సినిమా చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న కూడా ప్రేక్షకులు థియేటర్ కి రావాలని ఉన్న పైరసీ లో సినిమాను డౌన్ లోడ్ చేసి చూస్తున్నారు.

    ఇక ధియేటర్స్ కి పైరసీ వల్ల 13,700 కోట్ల నష్టం వచ్చింది… ఇక ఓటిటి ప్లాట్ ఫామ్స్ కి 8,700 కోట్ల నష్టం వాటిల్లింది. అలాగే జిఎస్టి రూపం 4300 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఇక మొత్తానికైతే 2023వ సంవత్సరంలో భారీ నష్టాలైతే వచ్చాయి. నిజానికి ప్రతి సంవత్సరం ఈ నష్టం అనేది పెరుగుతూనే పోతుంది తప్ప తగ్గడం లేదు.

    మరి దీనికి అంతం లేదా మంచి సినిమా బతికే అవకాశం లేదా పైరసీ బెడద పోవాలంటే ఏం చేయాలి అనే దానిమీద గవర్నమెంట్ కు సంబంధించిన కొంతమంది లీడర్లు , సినిమా పెద్దలు చాలా వరకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళు ఎవరు కూడా దీన్ని అరికట్టే ప్రయత్నం చేయలేకపోతున్నారు…ఇక ఇప్పటికీ 70% పీపుల్స్ పైరసీ లోనే సినిమాలు చూస్తున్నారు. అంటే పైరసీ అనేది సినిమా ఇండస్ట్రీ పైన ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు…