Graham Bell: హలో’ అనే పదాన్ని కనిపెట్టింది గ్రహంబెల్ కాదు.. మరి ఎవరంటే?

కొన్ని రోజుల వరకు ఫోన్ కనిపెట్టింది గ్రహంబెల్ అయితే.. హలో అనే పదాన్ని కొనుగొన్నది కూడా గ్రహంబెల్ అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా గ్రహంబెల్ కు ‘హలో’ అనే గర్ల్ ఫ్రెండ్ ఉండేదని, అందుకే ఫోన్ ఎత్తగానే హలో అంటున్నారని చెప్పారు.

Written By: Srinivas, Updated On : October 22, 2024 5:41 pm

Graham Bell who invented the word 'hello'

Follow us on

Graham Bell: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటోంది. అదీ స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా ఉంటుంది. ఫోన్ లేకపోవడం వల్ల కొన్ని పనులు జరగని పరిస్థితి ఎదురైంది. ఒకప్పుుడు మాట్లాడుకోవడానికి, మెసేజ్ చేయడానికి మాత్రమే ఫోన్ అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఏ పని చేయాలన్నా..ముందుగా ఫోన్ తప్పనిసరిగా వాడుతున్నారు. ఫోన్ వివిధ దశల నుంచి స్మార్ట్ ఫోన్ వరకు వచ్చింది. ముందుగా ఒక డబ్బాలాగా ఉండి .. దానిపై రిసీవర్ ఉండేంది. అయితే ఫోన్ ను కనుగొన్నది ఎవరు? అని అనగానే గ్రహం బెల్ అని అందరూ అంటారు. అలాగే ఎవరైనా ఫోన్ చేయగానే.. ముందుగా పలకరించే పదం.. Hello(హలో) అని.. అసలు ఫోన్ ఎత్తగానే ముందుగానే హలో అని ఎందుకు అన్నారు? దీనిని ఎవరు కనిపెట్టారు? ఈ ఆసక్తి వివరాల్లోకి వెళితే..

కొన్ని రోజుల వరకు ఫోన్ కనిపెట్టింది గ్రహంబెల్ అయితే.. హలో అనే పదాన్ని కొనుగొన్నది కూడా గ్రహంబెల్ అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా గ్రహంబెల్ కు ‘హలో’ అనే గర్ల్ ఫ్రెండ్ ఉండేదని, అందుకే ఫోన్ ఎత్తగానే హలో అంటున్నారని చెప్పారు. కానీ కొంత మంది పరిశోధనలు చేసి ఇది తప్పని నిరూపించారు. ఫోన్ ను కనిపెట్టింది గ్రహంబెల్ అని.. కానీ హలో అనే పదాన్ని కనిపెట్టింది మాత్రం ఆయన కాదని తేల్చారు. గహంబెల్ ఫోన్ ను కనిపెట్టిన తరువాత ముందుగా ‘OH’ అనే పదం వాడారు. దీనిని ఆయన డచ్ పదం నుంచి తీసుకున్నారు. మరి ఎవరు కనిపెట్టారంటే?

హలో అనే పదాన్ని మొట్టమొదటి సారిగా ‘థామస్ అల్వా ఎడిషన్’ కనిపెట్టారని తేలిపోయింది. థామస్ అల్వా ఎడిషన్ రికార్డెడ్ సౌండ్ సూత్రాలను కనుగొన్నాడు. ఈ క్రమంలో ఆయన హలో అనే పదాన్ని ఉపయోగించారు. దీనిని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి సేకరించినట్లు తేలింది. 1872లో పిట్స్ బర్గ్ లోని సెంట్రల్ డిస్ట్రిక్ట్ అండ్ ప్రింటింగ్ టెలిగ్రాప్ కంపెనీ అధ్యక్షుడి కాల్ తో హలో అనే పదాన్ని ఉపయోగించినట్లు రికార్డుల్లో ఉంది.

అప్పటి నుంచి హలో అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కాలంలో హలో అనే పదం మెల్లగా కనుమరుగు అవుతోంది. కొందరు స్మార్ట్ గా చెప్పండి.. లేదా.. పేరుతో పలకరిస్తున్నారు. ఆయితే గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు మాత్రం హలో అని సంబోధిస్తున్నారు. అలాగే రిసీవర్ ఫోన్ నుంచి క్రమంగా స్మార్ట్ ఫోన్ వరకు మారిన క్రమంలో రకరకాల ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడే ఇప్పుడు ఫోటోలు, వీడియోలతో పాటు సినిమాలు కూడా చూస్తున్నారు. అలాగే కొందరు ఉద్యోగాలు చేసేవారికి స్మార్ట్ ఫోన్ ప్రధానంగా ఉందనేది వాస్తవం.

అయితే స్మార్ట్ ఫోన్ ఎలా ఉన్నా.. దానిని అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవాలి. కొందరు స్మార్ట్ ఫోన్ తో అనవసరంగా కాలక్షేపం గడుపుతున్నారు. రాత్రిళ్లు నిద్రపోకుండా ఫోన్ తోనే ఉంటున్నారు. ఇలా చేయడం వల్ల అనారోగ్యాల పాలవుతారని తెలిసినా ఫోన్ ను వీడడం లేదు.ఇప్పటికైనా ఫోన్ ను అవసరాల మేరకు మాత్రమే ఉపయోగించుకోవాలి.