Breakfast: మనం తీసుకునే ఆహారమే మనకు రక్షగా ఉంటుంది. ఏది పడితే అది తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మంచి పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇరవై ఏళ్లకే అన్ని వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అందుకే ఆరోగ్యాన్ని గురించి నిర్లక్ష్యం చేయొద్దు. మంచి ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకుంటూ హెల్త్ ను పట్టించుకోవాలి. లేకపోతే మన జీవితం కష్టాల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి.

ఉదయం పూట తీసుకునే దాన్ని అల్పాహారం అంటారు. ఇది మనకు ఎంతో మేలు చేస్తుంది. రాత్రంతా కడుపు ఖాళీగా ఉండటంతో ఉదయం ఏదైనా తినాలని అనిపిస్తుంది. అలాగని ఏది పడితే అది తింటే అనర్థమే. దీంతో అల్పాహారంలో ఏం తీసుకోవాలనేదానిపై వైద్యులు సూచనలు చేస్తున్నారు. మనం తీసుకునే టిఫిన్ మన ఆరోగ్యాన్నా కాపాడేదిగా ఉండాలి. కానీ దాంతో మనకు నష్టం కలిగే విధంగా ఉండకూడదని తెలుసుకోవాలి. దీనికి గాను కొన్ని జాగ్రత్తలు పాటించి తీరాల్సిందే. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందే.
Also Read: Harish Shankar: పవన్ కళ్యాణ్ కోసం ఎన్నేళ్లయిన ఆగుతానంటున్న హరీష్ శంకర్
అల్పాహారంలో వీలైనంత వరకు నూనెతో తయారు చేసినవి వాడకూడదు. నూనెలో దేవిన వాటితో మన ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుంది. నూనెతో చేసిన వాటిని సాధ్యమైనంత వరకు దూరం పెట్టాల్సిందే. వీటికి బదులుగా నూనె లేకుండా చేసే ఇడ్లీ, దోశ వంటి వాటినే తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఈ నేపథ్యంలో మనం తీసుకునే ఆహారం విషయంలో కాస్త అప్రమత్తంగా ఉంటూ మితాహారం తీసుకుంటేనే ప్రయోజనం కలుగుతుంది.

టిఫిన్ విషయంలో అశ్రద్ధ తగదు. మనం తినే ఆహారంతోనే మన ఆరోగ్యం ముడిపడి ఉంటుందని తెలుసుకోవాలి. అందుకే ఉదయం పూట తీసుకునే టిఫిన్ నూనె లేకుండా చూసుకోవాలి. నూనె పదార్థాలతో కొవ్వు పెరిగి గుండె, కాలేయం లకు ప్రమాదం పొంచి ఉంది. దీంతో మన అల్పాహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే. టిఫిన్ తినేటప్పుడు నూనె లేకుండా చూసుకుని తింటేనే మేలు కలుగుతుంది. మన ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మనకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.
Also Read:Vaishnav Tej: సినిమాపై ఏమాత్రం హైప్ లేదు… మెగా హీరో వైష్ణవ్ పరిస్థితేంటి?