Luck With Bath: మనకు అదృష్టం ఉంటే ఏదైనా కలిసి వస్తుంది. అదృష్టానికి మన కృషి కూడా తోడైతే అన్ని కలిసొస్తాయి. అదృష్టం వరించాలంటే మన కష్టం కూడా తోడవ్వాలి. అదృష్టం కలిసి రావాలంటే పనులు కూడా పూర్తవ్వాలి. గంగానదిలో స్నానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. మనం స్నానం చేసే నీటిలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కలుపుకుంటే తిరుగు ఉండదు.
మనం స్నానం చేసే నీటిలో వేసుకునే వస్తువులతో మన అదృష్టం సిద్ధిస్తుంది. డబ్బు, కీర్తిలకు లోటుండదు. పసుపులో మంచి గుణాలుంటాయి. అందుకే మనం స్నానం చేసే నీటిలో కలుపుకోవడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. గోరువెచ్చని నీటిలో కొంచెం పసుపు కలుపుకుని స్నానం చేయడం వల్ల శుభం కలుగుతుంది. గంధాన్ని పూజలో ఉపయోగిస్తాం.
చందనం విజయం, సంపద, కీర్తిని పెంచుతాయి. గంధం నూనెను కానీ గంధం పొడిని కానీ స్నానం చేసే నీటిలో కలుపుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. సానుకూల శక్తి పెరుగుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. శరీరం చల్లగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వేప కూడా యాంటీ బ్యాక్టీరియల్, క్రిమినాసిక లక్షణాలకు ప్రసిద్ధి. నీటిలో వేప పువ్వుని వేస్తే శుభం జరుగుతుంది.
తులసి ఆకులను స్నానం చేసే నీళ్లలో వేసుకోవడం మంచిది. గులాబీ రేకులను కూడా స్నానం చేసే నీటిలో వేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అదృష్టం కలిసొస్తే మనకు కావాల్సిస పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి. ప్రతికూల శక్తులు దూరం కావాలంటే మనం కొన్ని పరిహారాలు చేసుకోవడం మంచిది. ఈ నేపథ్యంలో మన అదృష్టం బాగుండాలంటే మనకు అన్ని రకాలుగా కలిసి రావాలి.