Bad Habits: ఈ అలవాట్లు నెగెటివ్ ఆలోచనలను తెస్తాయి..

జీవితంలో పాజిటివీటి అనేది చాలా ముఖ్యం. ప్రతీ విషయాన్ని పాజిటివ్ గా తీసుకుంటే అంతా మంచే జరుగుతుంది. ఏం జరిగినా.. దాని కోసం పెద్దగా హైరానా పడకుండా సమస్య పరిష్కారం కోసం ఆలోచించాలి.

Written By: Chai Muchhata, Updated On : January 6, 2024 4:33 pm

Bad Habits

Follow us on

Bad Habits: అందమైన జీవితం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ ఆ జీవితం కోసం కొన్ని పాటించాలంటే మాత్రం అస్సలు ఒప్పుకోరు. మంచి జీవితం ఉండాలంటే కొన్ని మంచి అలవాట్లు చేసుకోవాలని వివిధ మార్గాల ద్వారా ఎంత చెప్పినా కొందరు పట్టించుకోరు. ఫలితంగా నిరాశ, నిస్పృహలతో గడిపేస్తారు. నేటి కాలంలో తాత్కాలిక ఆనందాన్ని కోరుకుంటూ అనేక తప్పులు చేస్తున్నారు. వీటి ఫలితంగా భవిష్యత్ లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొన్ని లక్షణాలతో తమ జీవితాలను చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. వీటిలో నెగెటివ్ థింకింగ్ అనేది చాలా డేంజర్. నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉండే ప్రయత్నం చేసినప్పుడే లైప్ హ్యాపీగా ఉంటుంది. మరి నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలంటే ఏం చేయాలి?

వ్యసనాలు:
జీవితంలో పాజిటివీటి అనేది చాలా ముఖ్యం. ప్రతీ విషయాన్ని పాజిటివ్ గా తీసుకుంటే అంతా మంచే జరుగుతుంది. ఏం జరిగినా.. దాని కోసం పెద్దగా హైరానా పడకుండా సమస్య పరిష్కారం కోసం ఆలోచించాలి. అప్పుడే శరీరంపై ఎటువంటి ప్రభావం ఉండదు. నెగెటివ్ ఆలోచనలకు ఆస్కారం వ్యసనాలు. కొన్ని వ్యసనాలు మనసును పాడు చేస్తాయి. దీంతో వ్యతిరేక ఆలోచనలు వస్తాయి. వీటిలో ప్రధానంగా మద్యం, ధూమపానం లాంటివి జీవితంలో నిరాశను తెస్తాయి. వీటి బారిన పడేవారు ఎప్పుడూ నెగెటివ్ గా ఆలోచిస్తారని కొన్ని సర్వేల్లో తేలుతోంది.

అసంతృప్తి:
ఒక వస్తువు కావాలనుకున్నవారు లేదా ఒక పనిని పూర్తిగా చేయలేని వారు తీవ్ర అసంతృప్తితో ఉంటారు. అయితే ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా పరిస్థితుల బట్టి అనుకున్న పనులు పూర్తి కావు. ఇలాంటి సమయంలో ఎక్కువగా ఆ పని ఎందుకు కాలేదు? అనే దాని కన్నా మరోసారి ప్రయత్నించాలి అనే భావన కలిగించుకోవాలి. ఈ సమయంలో అసంతృప్తికి ఆస్కారం ఇవ్వకుండా ఉన్నదాంట్లో సరిపెట్టుకోవాలి అనే ఆలోచనతో ఉండాలి. అప్పుడే సంతృప్తికర జీవితం ఉంటుంది.

ఆరోగ్య ఆహారం:
నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. కేవలం రుచి కోసం మాత్రమే చూడకుండా ఎనర్జీ ఇచ్చే వాటిపై దృష్టి పెట్టాలి. అప్పుడే శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. దీంతో ఎలాంటి అలసటకు గురికాకుండా అనుకున్న పనులు చేయగలుగుతారు. ముఖ్యంగా మసాలా ఫుడ్స్ కాకుండా సాఫ్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇవి అనుకున్న రుచిని ఇవ్వకపోయినా ఆరోగ్య జీవితాన్ని అందిస్తాయి.

ప్రణాళిక లేకుండా..
ప్రతి ఒక్కరు తమ లైఫ్ డిఫరెంట్ గా ఉండాలని కొత్త కొత్త అలవాట్లను చేసుకుంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రణాళిక లేకుండా కొన్ని పనులు చేయడం ద్వారా అవి పూర్తి కావు. దీంతో తమ జీవితం ఇంతే.. అనే భావనతో కలిగి ఉంటారు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనై.. అనారోగ్యాల బారిన పడుతారు. అయితే ప్రశాంతంగా ఆలోచిస్తూ మనసు పాడవకుండా ఆలోచించి పనులు చేయాలి.