
2023 Top Upcoming Bikes: బైక్ అంటే యూత్ లో క్రేజ్ అంతా ఇంత కాదు. అలా హ్యాండిల్ చేయడం రాగానే .. ఇలా బైక్ నడిపేయాలని ఉవ్విళ్లూరుతారు. మార్కెట్లోకి కొత్త బైకులొస్తున్నాయంటే ఎగబడతారు. సొంతం చేసుకోవాలని తహతహలాడుతారు. అలాంటి వారికి ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు. టీవీఎస్ అపాచి ఆర్టీఆర్ 310 నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 వరకు వివిధ మోడళ్లు త్వరలో మార్కెట్లోకి రాబోతున్నాయి. సరికొత్త హంగులతో.. నూతన సాంకేతికతతో మార్కెట్ ను ముంచెత్తనున్నాయి. ఆ బైక్ లేంటో ? వాటి విశేషాలేంటో స్టోరీలో తెలుసుకుందాం.
టీవిఎస్ అపాచి ఆర్టీఆర్ 310
టీవీఎస్ అపాచి ఆర్టీఆర్ 310 మోడల్ 2023లో మార్కెట్లోకి రానుంది. ఇది ఆర్ఆర్ 310 మోడల్ ను పోలి ఉంటుంది. టీవీఎస్ అపాచి ఆర్టీఆర్ 310లో 132 సిసి లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను ఉపయోగించారు. ఈ మోడల్ టీఎఫ్టీ క్లస్టర్, అడ్జస్టబుల్ సస్పెన్షన్, రైడ్ మోడ్స్ ఫీచర్స్ తో అందుబాటులోకి రానుంది. 2023 మార్చిలో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

2023 కేటీఎమ్ 390 డ్యూక్
ఇది కొత్త తరానికి చెందిన కేటీఎమ్ మోడల్ అని చెప్పవచ్చు. ఇప్పటికే దీనిని ఇండియాలో పరీక్షించారు. ఉత్పత్తి చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. త్వరలో ఇది మార్కెట్లోకి రాబోతోంది. త్వరలో దీనికి సంబంధించిన డిజైన్, ఇంజిన్ అప్ గ్రేడేషన్ ను ఆమోదించనున్నారు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.5 లక్షలుగా ఉండే అవకాశం ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450
ఈ మోడల్ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ తో రూపొందించబడింది. ఇప్పటికే అనేకసార్లు దేశీయ రోడ్ల పై టెస్ట్ రైడ్ నిర్వహించారు. ఆగస్టు 2023లో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 2.8 లక్షలు ఉండే అవకాశం ఉంది.

హీరో ఎక్స్ పల్స్ 400
2023 ద్వితియాతార్థంలో ఈ మోడల్ ను హీరో మోటోకార్ప్ సంస్థ మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీనిని 421 సిసి లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో రూపొందించారు. దీని ధర రూ. 2.5 లక్షల నుంచి 2.7 లక్షల మధ్య ఉండనుంది. ఇది మార్కెట్లోకి వస్తే కచ్చితంగా ఆర్ఈ హిమాలయన్ 450, కేటీఎమ్ 390 మోడల్ లకు గట్టి పోటీ ఇన్వనుంది.

2023 హోండా సీబీఆర్300ఆర్
ఈ మోడల్ ను హోండా కంపెనీ 2023 మధ్యలో మార్కెట్లోకి తీసుకురానుంది. దీనిని 286 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ తో రూపొందించారు. దీని ధర రూ. 2 లక్షల నుంచి 2.30 లక్షల మధ్య ఉండనుంది.

2023 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350
త్వరలో ఈ మోడల్ ను మార్కెట్లోకి తీసుకురానున్నారు. దీనిని 349 సిసి సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్ తో రూపొందించారు. ఇది 20 బీహెచ్పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. 350 మోడల్ కంటే 350 సిసి మోడల్ మరింత చౌకగా మార్కెట్లో అందుబాటులో ఉండనుంది.

బజాజ్ ట్రింప్ మోటార్ సైకిల్
పోయిన సంవత్సరం దీనిని రోడ్ల పై టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. దీనిని 350 సిసి ఇంజిన్ తో రూపొందించారు. సీట్ , హెడ్ ల్యాంప్, ఫ్యూయల్ ట్యాంక్ విషయంలో స్ట్రీట్ ట్విన్ మోడల్ ను పోలి ఉంటుంది. త్వరలో ఇది కూడా మార్కెట్లోకి రానుంది.
కొత్త మోడల్ ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదొక మంచి సమయం అని చెప్పవచ్చు. ఆధునికతను జోడించి మార్కెట్లోకి కొత్త మోడల్ లను వివిధ కంపెనీలు తీసుకొస్తున్నాయి. ఇప్పటికే చాలా మోడళ్లు టెస్ట్ డ్రైవ్ లు పూర్తీ చేశాయి. ఇక మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం అన్నట్టు కొత్త మోడల్స్ సందడి ఉంది.
