Top Ten Apps: అరచేతిలోకి ప్రపంచం వచ్చేసింది. స్మార్ట్ ఫోన్ రాకతో ప్రపంచంలో ఏ మూలన ఏం ఉన్నా క్షణాల్లో మన ముందుకు వచ్చేస్తున్నాయి. సోషల్ మీడియా ప్రపంచంలోని ప్రజల మధ్య దూరాన్ని బాగా తగ్గించేసింది.ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణాన్ని మనం ఇక్కడి నుంచే సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోల ద్వారా ఎప్పటికప్పుడు చూస్తున్నాం. సోషల్ మీడియాలో లేకుంటే టాంజానియాలోని కిలీ పాల్ అనే డ్యాన్సర్ కూడా వెలుగులోకి వచ్చేవాడు కాదు.ఇలా సోషల్ మీడియా మొత్తం మార్చేసింది.
ఇక సోషల్ మీడియా వచ్చేశాక అందరికీ ఇంటర్నెట్ వినియోగం చేరువైంది. యాప్‌లు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల జీవితాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. చాలామంది వాటిపై డబ్బు ఖర్చు చేస్తున్నారు. ‘సెన్సార్ టవర్’ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత పాపులర్ యాప్ లు పది ఉన్నాయి. వీటిపై వినియోగదారులు ప్రపంచంలోనే ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నారు.”ఆపిల్ యాప్ స్టోర్‌లోని టాప్ 100 నాన్-గేమ్ సబ్‌స్క్రిప్షన్ యాప్‌లు.. 2021లో $13.5 బిలియన్లను ఆర్జించాయి” అని ఈ నివేదిక పేర్కొంది. వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్‌లోని టాప్ 100 సబ్‌స్క్రిప్షన్ యాప్‌ల కోసం $4.8 బిలియన్లు ఖర్చు చేశారు. మొత్తం డబ్బు $18 బిలియన్లకు మించి ఖర్చు చేస్తున్నట్టు తేలింది. టాప్ 10 యాప్‌ల జాబితాలో డేటింగ్ యాప్‌లు, ఓటీటీ కంటెంట్ స్ట్రీమింగ్ యాప్‌లు.. కొన్ని గూగుల్ యాప్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు అత్యధికంగా డబ్బు ఖర్చు చేసిన టాప్ 10 యాప్‌లు ఇక్కడ ఉన్నాయి. వాటి విశేషాలు తెలుసుకుందాం.
– గూగుల్ వన్

జాబితాలో Google One అగ్రస్థానంలో ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఇది గూగుల్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్. ఇది గూగుల్ కలిగి ఉన్న దాదాపు ప్రతి సేవకు వినియోగదారులకు యాక్సెస్‌ని ఇస్తుంది. వినియోగదారులు అదనపు క్లౌడ్ నిల్వను ఇందులో పొందవచ్చు, చాలామంది ఫోటోల కోసం ఇందులో ఎక్కువ స్థలాన్ని దీనికి కేటాయిస్తారు.
Also Read: ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకు షాకిచ్చిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్
-డిస్నీ+

2021లో చాలా మంది వ్యక్తులు ఎక్కువగా వాడిన యాప్ గా డిస్నీ+ నిలిచింది. వారి స్క్రీన్‌లపై వినోదం కోసం వెతుకుతూ దీన్ని ఎక్కువగా చూశారు. కంటెంట్ వినియోగం విపరీతంగా పెరిగింది. డిస్నీ+ వంటి ఓటీటీ యాప్‌ల కోసం ప్రజలు చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు.
-యూట్యూబ్

ప్రపంచంలోని అత్యంత జనాదరణ పొందిన యాప్‌లలో ఒకటిగా యూట్యూబ్ నిలిచింది. యూట్యూబ్ ను అత్యంత ఎక్కువగా చూస్తున్న యాప్ గా ఇది ఉంది. వినియోగదారులు దీనిపై ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. అలాగే సమయాన్ని వెచ్చిస్తున్నారు.
-హెచ్.బీ.వో మాక్స్

HBO.. ప్రీమియం ఓటీటీ కంటెంట్ ప్లాట్‌ఫారమ్ యాప్‌ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. దీనిపై స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.
-టిండెర్

జనాదరణ పొందిన డేటింగ్ యాప్ Tinder. వినియోగదారులు అత్యధికంగా డబ్బు ఖర్చు చేసిన టాప్ 10 యాప్‌ల జాబితాలో ఇది ఐదో స్థానంలో ఉంది.
-పండోర

పాడ్‌క్యాస్ట్‌లు, మ్యూజిక్ స్ట్రీమింగ్.. ఇతర ఆడియో కంటెంట్ కోసం పడోరా యాప్ వాడుతారు. ఇది యూరోప్.. అమెరికాలోని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే ఒక ప్రసిద్ధ యాప్.
-ట్విట్చ్

గేమర్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్ ట్విచ్. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్లాట్‌ఫారమ్ చాలా అభివృద్ధి చెందింది.
-ఈఎస్.పీఎన్
అమెరికాలో ESPN స్పోర్ట్స్ కంటెంట్‌కు ప్రధాన యాప్ గా ఉంది. ఇది అన్ని యాప్ లలో ఆధిపత్యం చెలాయిస్తోంది. చాలా మంది క్రీడల కోసం ఈ యాప్ ను చూస్తున్నారు.
-బంబుల్

టిండెర్ తర్వాత, డేటింగ్ యాప్‌లలో బంబుల్ బాగా ప్రాచుర్యం పొందింది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు అత్యధికంగా డబ్బు వెచ్చించిన అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌లలో ఇది తొమ్మిదో స్థానంలో ఉంది.
-హులు

Also Read: ‘భీమ్లానాయక్’కు చంద్రబాబు, లోకేష్ సపోర్టు.. జూ.ఎన్టీఆర్, బాలకృష్ణను లాగి కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని
ఈ ప్లాట్‌ఫారమ్‌లలో వినోదాన్ని కోరుకునే వినియోగదారులు బాగా ఇష్టపడే యాప్ హులు. ఓటీటీ జాబితాలో అందరికంటే ఎక్కువగా చూసే యాప్ గా ఇది ఉంది.
Also Read: సరికొత్త ఛాలెంజింగ్ పాత్రలో సుహాసిని.. షాకింగ్ లుక్
Also Read: ఉక్రెయిన్ చేసిన తప్పేంటి.? ఎందుకీ పరిస్థితి..? ఆ దేశాల పాపమే శాపమైందా?
Recommended Video:
