Bheemla Nayak Politics: రాజకీయాలు అన్న తర్వాత అవసరాన్ని బట్టి అవసరం ఉన్న వారితో కలిసిపోతుంటారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉన్న పవన్ కల్యాణ్ విషయంలో జగన్, కేసీఆర్ తలో రకంగా స్పందిస్తున్నారు. వాస్తవానికి పవన్ కల్యాణ్ మొదటి నుంచి జగన్‌ను విమర్శిస్తూనే ఉన్నారు. దాంతో జగన్‌కు ఆయన మీద కోపం ఉంది. ఇక ఇటు కేసీఆర్ తో మాత్రం పవన్ సందర్భాన్ని బట్టి ఒక్కోసారి విమర్శించినా.. ఒక్కోసారి పొగడ్తలతో ముంచెత్తారు.
అయితే ఇప్పుడు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు భీమ్లానాయక్ మూవీ విషయంలో అటు ఏపీలో తీవ్రమైన ఆంక్షలు విధించింది జగన్ ప్రభుత్వం. ఇంకా చెప్పాలంటే కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారంటూ పవన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. కానీ ఇటు తెలంగాణలో మాత్రం ఈ మూవీకి పూర్తి స్థాయిలో గవర్నమెంట్ సహకరిస్తోంది.
Also Read: జగన్ పై ‘భీమ్లానాయక్’ మూవీలో పవన్ సంచలన సెటైర్లు? వైరల్
ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. పవన్‌కు మొదటి నుంచి కేటీఆర్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. అవే కేసీఆర్‌తో కూడా సన్నిహిత్యం పెరిగేలా చేశాయని అంటున్నారు. అందుకే భీమ్లానాయక్‌కు బెన్ ఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు రోజుకు ఐదు షోల చొప్పున పర్మిషన్ ఇచ్చేశారు గులాబీ బాస్. పైగా మొన్న జరిగిని ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కేటీఆర్ హాజరై పవన్ మీద ప్రశంసలు కురిపించారు.
ఇక్కడే ఓ విషయం అందరినీ గందరగోళానికి గురి చేస్తోంది. పవన్ ఇప్పుడు బీజేపీకి మిత్రుడు. ఇటు కేసీఆర్ ఏమో బీజేపీతో యుద్ధం మొదలు పెట్టారు. మరి ఒకవేళ పవన్‌ను తమకు దగ్గర చేసుకుంటే.. రాబోయే కాలంలో పవన్ మెజార్టీ సీట్లు నెగ్గితే తమకు సహకరిస్తారనే ప్లాన్ కూడా అయి ఉండవచ్చు. ఇక కేసీఆర్ కుటుంబం పవన్‌కు సహకరించడం జగన్‌కు నచ్చదని తెలిసిందే. ఇది జగన్‌కు, కేసీఆర్‌కు మధ్య గ్యాప్ రావడానికి కూడా దారి తీస్తుంది. మరి దీని వెనకాల ఏదైనా పెద్ద రాజకీయ వ్యూహం ఉందా లేదంటే సందర్భాను సారంగా కేటీఆర్ ఈవెంట్‌కు వెళ్లారా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Also Read: భీమ్లానాయక్ టికెట్ రేట్స్ చూస్తే మీ గూబ గుయ్ మంటది?