దేశంలోని ప్రజలు ఈ నెల 31వ తేదీలోపు కొన్ని పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలి. చాలా ముఖ్యమైన పనులు చేయడానికి అక్టోబర్ 31 చివరి తేదీ అని చెప్పవచ్చు. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన హెచ్డీఎఫ్సీ ఈ నెల 31వ తేదీ వరకు గృహ రుణం తీసుకోవాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూర్చనుంది. గృహ రుణం తీసుకోవాలని భావించే వాళ్లకు ఈ బ్యాంక్ స్పెషల్ ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది.

మరోవైపు రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ లో చేరడం ద్వారా రెట్టింపు బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు ఎస్బీఐ యోనో యాప్ సహాయంతో ఉచితంగా ఐటీఆర్ ను దాఖలు చేసే అవకాశం ఉంటుంది. నిర్ణీత ఫీజును చెల్లించడం ద్వారా ఐటీఆర్ ను దాఖలు చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఐటీఆర్ ఫైలింగ్ కొరకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఫారం 16, పన్ను మినహాయింపు వివరాలు, పన్ను ఆదా కోసం వడ్డీ ఆదాయం సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి.
ఎస్బీఐ కస్టమర్లు మాత్రమే ఈ ఫీచర్ ను వినియోగించుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మరోవైపు పీఎం కిసాన్ యోజన స్కీమ్ లో నమోదు చేసుకోని వాళ్లు ఈ నెల 31వ తేదీలోగా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఆమోదించబడితే ఈ స్కీమ్ ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలు పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. అక్టోబర్ 31వ తేదీలోగా వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లకు సంబంధించిన రీ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
సర్టిఫికెట్ల రీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయని పక్షంలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో 6.70 శాతం వడ్డీరేటుతో గృహ రుణాలను అందిస్తోంది. ఈ నెలాఖరులోపు ఈ పనులను పూర్తి చేస్తే మంచిదని చెప్పవచ్చు.