Prabhu Deva: 29న ‘మిస్ట‌ర్ ప్రేమికుడు’గా రాబోతోన్న ప్ర‌భుదేవా

Prabhu Deva: ప్ర‌భుదేవా హీరోగా ఇటీవల తమిళంలో తెరకెక్కిన చిత్రం ” చార్లీ చాప్లిన్ “. ఈ మూవీ లో అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని హీరోయిన్లుగా నటించారు. శ్రీ తార‌క‌రామ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎమ్.వి. కృష్ణ స‌మ‌ర్ప‌ణ‌లో… వి. శ్రీనివాస‌రావు, గుర్రం మ‌హేష్ ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువ‌దిస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ ‘మిస్టర్ ప్రేమికుడు’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 29న గ్రాండ్‌గా విడుదల […]

Written By: Raghava Rao Gara, Updated On : October 20, 2021 6:49 pm
Follow us on

Prabhu Deva: ప్ర‌భుదేవా హీరోగా ఇటీవల తమిళంలో తెరకెక్కిన చిత్రం ” చార్లీ చాప్లిన్ “. ఈ మూవీ లో అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని హీరోయిన్లుగా నటించారు. శ్రీ తార‌క‌రామ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎమ్.వి. కృష్ణ స‌మ‌ర్ప‌ణ‌లో… వి. శ్రీనివాస‌రావు, గుర్రం మ‌హేష్ ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువ‌దిస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ ‘మిస్టర్ ప్రేమికుడు’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 29న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంధర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు చిత్ర బృందం.

త‌మిళంలో రూపొంది ఘ‌న విజ‌యం సాధించిన ‘చార్లిచాప్లిన్’ చిత్రాన్ని తెలుగులో కూడా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంలోని పాట‌లతో పాటు సెకండాఫ్‌లో వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకు హైలెట్‌గా ఉంటాయన్నారు. ప్ర‌భుదేవా నటన, డాన్స్‌తో పాటు అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని అందం, అభిన‌యం సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి అని చెప్పారు. ప్రేక్ష‌కులు ఈ చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాం అని పేర్కొన్నారు. గతంలో ప్రేమికుడు పేరుతో తెరకెక్కిన ప్రభుదేవా చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

1994 లో శంకర్ దర్శకత్వంలో విడుదలైన ప్రేమికుడు చిత్రం కూడా  తమిళ అనువాద చిత్రమే. తమిళ చిత్రం కాదలన్ దీనికి మూలం. ఇందులో నగ్మా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి.