Early white hair reasons: ఇటీవల చాలామంది చిన్నవయసులోనే తెల్ల వెంట్రుకలతో కనిపిస్తున్నారు. వాతావరణంలో మార్పులు లేదా విటమిన్ లోపం వల్ల ఈ సమస్య వస్తుందని ఇప్పటికే వైద్యులు తేల్చారు. కారణం ఏదైనా కూడా వయసు పడకుండా తెల్ల వెంట్రుకలు ఉండడంవల్ల సమస్యగా భావిస్తారు. తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చుకోవడానికి అనేక మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలో కొందరు అనేక అనారోగ్య సమస్యలు కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. అసలు చిన్నవయసులో వెంట్రుకలు తెల్లబడడానికి విటమిన్స్, వాతావరణం లోపమని కొందరు అంటున్నా.. ఇలాంటి విటమిన్ లోపం వల్ల ఈ సమస్యలు వస్తాయి? ఆ నివారణకు ఏం చేయాలి?
వ్యక్తులు అందంగా కనిపించడానికి వెంట్రుకలు ప్రధాన కారణం. ఇవి నల్లగా ఉంటేనే మనిషి అందంగా కనిపిస్తారు. వ్యక్తుల జుట్టుకు సహజరంగ్ రావడానికి మెలనిన్ అనే పదార్థం కారణం అవుతుంది. ఇది ఎయిర్ పాలికల్స్ లోని ప్రత్యేక కణాల ద్వారా ఉత్పత్తి అవుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మెల్లని ఉత్పత్తి సహజంగా తగ్గుతుంది. కానీ దీని ఉత్పత్తి చిన్న వయసులోనే తగ్గడం వల్ల జుట్టు తెల్లబడుతుంది. కొందరు వైద్యులు తెలుపుతున్న ప్రకారం వ్యక్తులలోని విటమిన్ బి12 లోపం వల్ల నల్ల జుట్టు తెల్లగా మారుతుంది. విటమిన్ బి12 శరీరంలో ఎర్ర రక్త కణాల తయారీకి, నాడి వ్యవస్థ ఆరోగ్యానికి, కణాల పునరుత్పత్తికి అత్యంత అవసరం. ఈ విటమిన్ లోపం ఏర్పడినప్పుడు ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా జుట్టు బలహీనపడడమే కాకుండా వయసుకు మించిన తెల్లజుట్టు వస్తుంది.
కేవలం విటమిన్ లోపం తోనే కాకుండా జెన్యూ పరమైన కారణాలు, అధిక ఒత్తిడి, నిద్రలేమి సమస్య, థైరాయిడ్ సమస్యలు, పోషకాహార లోపం, అతిగా కెమికల్ హెయిర్ ప్రోడక్ట్ వాడడం, స్మోకింగ్ మద్యం అలవాట్లు వంటివి ఉండడంవల్ల నల్ల జుట్టు తెల్లగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఈ నల్ల జుట్టు తెల్లగా మారకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన అలవాట్లను కలిగి ఉండాలి. ముఖ్యంగా రోజువారి జీవన విధానంలో అలవాట్లను మార్చుకోవాలి.
ప్రతిరోజు ఆకుకూరలు తినడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు వచ్చే అవకాశం ఉంది. వీటిలో పాలకూర, మెంతికూర, గోంగూర తినడం వల్ల శరీరానికి ఐరన్ అందుతుంది. అలాగే అరటి, బొప్పాయి, ఆపిల్ వంటి పనులు తినడం వల్ల జుట్టు సమస్య తగ్గుతుంది. ప్రోటీన్లు అధికంగా ఉండే పప్పులు, గుడ్లు, పాలు, పెరుగు వంటి వి తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. పాలు, పెరుగు, చేపలు, గుడ్లు తినడం వల్ల విటమిన్ బి 12 శరీరానికి అందుతుంది. అలాగే ప్రతిరోజు తగినంత నీరు తాగడం వల్ల.. ఒత్తిడి నుంచి దూరం కావడంవల్ల.. యోగా, ధ్యానం చేయడం వల్ల కూడా నల్ల జుట్టు తెల్లగా మారకుండా ఉంటుంది.
చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారితే ముందుగా వైద్యులను సంప్రదించడం మంచిది. అసలైన లోపాన్ని గుర్తించి దానికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ప్రత్యేకంగా కెమికల్స్ వాడడం వల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు తెచ్చుకున్న వారు అవుతారు.