India tourist places : చనిపోయే లోపు ఈ ప్రదేశాలు చూడటం అసలు మిస్ కావద్దు!

అయితే కొన్ని ప్రదేశాలను లైఫ్‌లో ఒక్కసారి అయిన చూస్తే చాలని మురిసిపోతుంటారు. ఆ ప్రదేశాలకు వెళ్లాలని డబ్బులు కూడా దాచుకుంటారు. మరి లైఫ్‌లో చనిపోయే ముందు ఒక్కసారైన చూడాల్సిన ఆ ప్రదేశాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Written By: NARESH, Updated On : November 5, 2024 8:57 pm

Famous-Tourist-Places-in-India-S

Follow us on

India tourist places : ట్రావెలింగ్ చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ వ్యక్తిగత కారణాలు, డబ్బులు, సమయం లేకపోవడం వల్ల ఎక్కువగా ట్రావెల్ చేయలేరు. ఈ ప్రపంచంలో కంటే ఇండియాలో ఉన్న అన్ని ప్రదేశాలను కాకపోయిన కొన్ని ప్రదేశాలను చూడాలని అనుకుంటారు. ముఖ్యంగా చనిపోయేలోపు కొన్ని ప్రదేశాలను తప్పకుండా చూడాలని అనుకుంటారు. ట్రావెల్ చేయడం వల్ల కొందరికి హాయిగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటారు. డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా విముక్తి చెందాలని, గతంలో జరిగిన విషయాలను మర్చిపోవాలని కొందరు ఎక్కువగా కొత్త ప్రదేశాలకు వెళ్తుంటారు. అయితే కొన్ని ప్రదేశాలను లైఫ్‌లో ఒక్కసారి అయిన చూస్తే చాలని మురిసిపోతుంటారు. ఆ ప్రదేశాలకు వెళ్లాలని డబ్బులు కూడా దాచుకుంటారు. మరి లైఫ్‌లో చనిపోయే ముందు ఒక్కసారైన చూడాల్సిన ఆ ప్రదేశాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

లడఖ్
జమ్మూ కశ్మీర్‌లో ఉన్న లడఖ్‌ను చూడాలని చాలా మంది కలలు కంటారు. ముఖ్యంగా ఇక్కడికి బైక్ మీద ట్రావెల్ చేయాలని ప్లాన్ చేస్తుంటారు. మంచు కొండల మధ్య లడఖ్ చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. సరస్సులు, మంచు పర్వతాలు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతీ ఒక్కరూ కూడా లఢఖ్‌ను డ్రీమ్ ప్లేస్‌గా ఊహించుకుంటారు. ఇక్కడికి వెళ్లడానికి ముందే డబ్బులు సేవ్ చేసుకుని పెట్టుకుంటారు. చలిగా ఉన్నా కూడా అదే సమయంలో వెళ్లాలని భావిస్తారు. ఎందుకంటే చలికాలంలో లడఖ్‌ను చూస్తే మంచుతో చాలా అందంగా ఉంటుందని వెళ్తుంటారు.

కన్యాకుమారి
దేశానికి చివరి పాయింట్ అయిన కన్యాకుమారి బీచ్, చివరి రోడ్డు చూస్తే రెండు కళ్లు సరిపోవు. ఇక్కడ ఉండే సముద్రం, ఆలయం అన్ని కూడా టూరిస్ట్‌లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చాలా మంది లైఫ్‌లో ఒక్కసారైన కూడా ఈ ప్లేస్‌కి వెళ్లాలని భావిస్తారు.

వారణాసి
ఉత్తర భారతదేశంలోని కాశి విశ్వనాథ్ ఆలయం చాలా పవిత్రమైనది. కాశీ దేవుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. జీవితంలో ఒక్కసారైన కాశీ వెళ్లాలని అక్కడ గంగా హారతి చూడాలని చాలా మంది కలల కంటారు. ఒక్కసారైన కాశీ ఆలయానికి వెళ్లాలని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. కొందరు పెద్దల అస్థికలు కలపడానికి కాశీ ఎక్కువగా వెళ్తుంటారు.

తాజ్ మహల్
ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ఆగ్రా వెళ్లాలని చాలా మంది కోరుకుంటారు. ప్రేమకు ప్రతీకగా తాజ్ మహల్‌ను షాజహాన్ తన భార్య కోసం కట్టించాడు. పాలరాతితో నిర్మించిన ఈ అద్భుత కట్టడం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఒక్కసారైన లైఫ్‌లో తాజ్ మహల్‌ను చూడాల్సిందే. ప్రేమకు గుర్తుగా షాజహాన్ ఇంత అద్భుతంగా తాజ్ మహల్‌ను కట్టాడో చూస్తే రెండు కళ్లు సరిపోవు.

మున్నార్
కేరళలోని మున్నార్ అందాలు చెప్పక్కర్లేదు. సముద్రమట్టానికి ఎత్తులో ఉండే ఈ హిల్ స్టేషన్ అందాలు చూడాలని చాలా మంది పరితపిస్తుంటారు. పచ్చని కాఫీ తోటలు, కొండలు మనస్సుకు హాయిని కలిగిస్తాయి. ఇక్కడికి వెళ్లాలని చాలా మంది అనుకుంటారు.