Career planning after 40: ప్రతి ఒక్కరూ 20 ఏళ్ల వరకు తల్లిదండ్రుల సమక్షంలో పెరుగుతారు. ఆ తర్వాత ఉద్యోగంలో చేరి బిజీ అయిపోతారు. 30 ఏళ్లలో వివాహం చేసుకుంటారు. కొత్త జీవితం ప్రారంభమైన క్రమంలో రకరకాల ఖర్చులు ఉంటాయి. ఇదే సమయంలో సరిపడే అంత ఆదాయం కూడా వస్తుంది. దీంతో ఎలాంటి ఆర్థిక భారం పడదు. అలా 40 ఏళ్లు గడిచే వరకు జీవితం సాఫీగానే గడుస్తుంది. కానీ ఇప్పటినుంచి అసలు జీవితం ప్రారంభమవుతుంది. ఈ వయసులో కొత్త ఉద్యోగం సాధ్యం కాదు పెట్టుబడులు పెట్టడానికి ఆదాయం సరిపోదు. తల్లిదండ్రుల సంరక్షణ.. పిల్లల బాధ్యతలు.. సొంత ఇల్లు నిర్మాణం వంటివి ఈ సమయంలోనే ఏర్పాటు చేసుకోవాలి. మరి అందుకోసం ఎలాంటి ఆర్థిక ప్రణాళికలు చేయాలి?
40 ఏళ్ల వయసు వచ్చిన వారు ఇప్పటివరకు తమ జీవితంలో ఉన్న వాటిని ఒకసారి సమీక్షించుకోవాలి. అంటే ఇప్పటివరకు ఎంత సంపాదించారు? ఎలాంటి ఖర్చులు పెట్టారు? ఇలాంటి పెట్టుబడులు చేశారు? వంటివి పునః సమీక్షించుకోవాలి.
ఇప్పటివరకు ఎంత సంపాదించారు అనేది ఆలోచించుకోవాలి. ఎందుకంటే కొత్తగా ఉద్యోగంలో చేరిన తర్వాత రకరకాల ఆశలు, కోరికలు పుడతాయి. చేతిలో డబ్బులు కనిపించగానే కొత్త వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. షికారులు చేస్తారు.. విహారయాత్రలకు వెళ్తారు.. అయితే ఇవన్నీ ఫోను ఎంత కూడా పెట్టారు? అనేది చాలా అవసరం. ఒకవేళ బ్యాంకులో ఎంత డబ్బు మిగిలింది? ఇది భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా అనేది చూసుకోవాలి.
40 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం సాధారణంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో మంచి పొజిషన్లో ఉంటే పర్వాలేదు. కానీ కొందరు ఇప్పటినుంచే కొత్త ఉద్యోగం కూడా చేసేవారు ఉన్నారు. అలాకాకుండా ఇప్పటివరకు ఉద్యోగం చేసిన వారు ఆ కంపెనీలో ఇంకా కొనసాగుతారా? లేదా సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తారా? అనే సమీక్షించుకోవాలి. ఈ రెండిటిలో ఏం చేసినా ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగం అయితే మరో 5 ఏళ్లలో ఎంత ఆదాయం వస్తుంది. ఆ వచ్చిన ఆదాయాన్ని ఎటువంటి వాటికి ఖర్చు పెట్టాలి? అనేది ప్లాన్ చేసుకోవాలి. వ్యాపారం అయితే నష్టం వస్తే ఏం చేయాలి అనేది ముందే నిర్ణయం తీసుకోవాలి. లాభం వస్తే పర్వాలేదు.. నష్టం వస్తే మాత్రం ఆర్థిక నిధిని ముందే ఏర్పాటు చేసుకోవాలి.
ఈ వయసులో ఉన్నవారు ఖర్చులను దాదాపు తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు స్నేహితులతో.. ఉద్యోగులతో ఎన్నో రకాల ఎంజాయ్ చేసి ఉంటారు. కానీ ఇప్పుడు దుబార ఖర్చులు చేయడం వల్ల ఆర్థిక భారం మీద పడుతుంది. వీటికి పెట్టే ఖర్చులు పిల్లల చదువులు లేదా ఇతర పెట్టుబడుదు పెట్టాలి.
40 ఏళ్లు వచ్చిన వారికి ప్రధాన బాధ్యత పిల్లల చదువులు. మరో 5 ఏళ్లలో ప్రాథమిక విద్య తర్వాత ఎక్కువగా ఖర్చులు ఉంటాయి. అందుకోసం ముందే ప్లాన్ చేసుకొని అందుకు తగిన విధంగా ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి. అటు తల్లిదండ్రుల సంరక్షణకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటికే మ్యూచువల్ ఫండ్ వంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవి ఎలా ఉన్నాయి? మరికొన్ని పెట్టుబడును పెట్టవచ్చా? అనేది నిర్ణయించుకోవాలి.