Honeymoon Couples: పెళ్లయిన తర్వాత హనీమూన్ కు వెళ్లాలని అనుకునే కపుల్స్ ఎక్కడికి వెళ్తారు? కొడైకెనాల్, ఊటీ వంటి ప్రాంతాల పేర్లు ముందుగా చెబుతారు. అయితే విదేశాలకు వెళ్లాలని అనుకునేవారు ఎక్కడికి వెళ్తారు? యూరప్ లేదా చల్లని ప్రదేశానికి వెళ్లాలని చూస్తారు. ఇప్పటివరకు ఇలాంటి అభిప్రాయమే ఉండేది. కానీ ఇప్పుడు కొత్త జంటల మనసు మారుతుంది. ఒకప్పటిలా లేదా పాతకాలం వారిలా ఆలోచించడం లేదు. హనీమూన్ విషయంలో కొత్త ట్రెండు సృష్టిస్తున్నారు. కొత్తగా పెళ్లయిన జంటలు లేదా కపుల్స్ సరదాగా గడపడానికి అమెరికా వంటి ప్రదేశాలకు కాకుండా దుబాయ్, వియత్నం, బాలి వంటి దేశాలను కోరుకుంటున్నారు. అలాగే మన దేశంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాల పేర్లు చెబుతున్నారు. మరి జంటల మనసు ఎందుకు మారుతుంది? అసలు హనీమూన్ కోసం గతంలో కంటే ఇప్పుడు ఖర్చు పెరిగిందా?
Pick your trail ఇటీవల నూతన జంటల ప్రయాణం గురించి సర్వే చేసింది. Gen Z ప్రయాణికుల విషయంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది. ఇప్పుడున్న వారిలో 62 శాతం మంది తమ వ్యక్తిగత జీవితంపై ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్నారు. అలాగే ధనవంతులతో పోలిస్తే మిడిల్ క్లాస్ పీపుల్స్ సైతం సరదా కోసం ఎక్కువగా ఖర్చులు చేస్తున్నారు. ముఖ్యంగా హనీమూన్ కు వెళ్లాలని అనుకునే జంటలు కొత్త ప్రదేశాలను వెతుక్కుంటున్నారు. 2025 ప్రారంభం నుంచి ఇప్పటివరకు హనీమూన్ కు వెళ్లిన వారిలో ఎక్కువగా వియత్నం, దుబాయ్ దేశాలకు టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలిసింది. అలాగే మాల్దీవులు, బాలి, థాయిలాండ్ వంటి దేశాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. ఒకప్పుడు యూరప్ దేశాల వైపు హనీమూన్ కోసం వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆసియా దేశాల వైపు ఎక్కువగా ఆసక్తి చూపడం విశేషం. వీటన్నింటిలో వియత్నం లో ఉండే సంస్కృతి, సరైన వాతావరణం ఉండడంతో చాలామంది ఇక్కడికి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఆ లాంగ్ బె లోని సాయంత్రం లాంతరు వెలుగుల వాతావరణంలో గడపాలని చాలామంది కోరుకుంటున్నారు. దుబాయ్ లోని స్కై టవర్స్ లో ఎంజాయ్ చేయాలని ఇష్టపడుతున్నారు. ఇక్కడ రూఫ్ టాప్ డిన్నర్లు, ఎడారి సఫారీలు, యాచ్ డేట్ లో హనీమూన్ జంటలకు ఆకర్షణీయంగా ఉన్నాయి.
భారతదేశ విషయానికొస్తే చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలు హనీమూన్ జంటలు తరలివస్తున్నారు. ఒకప్పుడు ప్రశాంత వాతావరణంలోని మాత్రమే కోరుకునేవారు. కానీ ఇప్పుడు నగరంలో విహరించాలని.. అక్కడి సంస్కృతిలో కలిసిపోవాలని కోరుకుంటున్నారు. అందుకే బిజీగా ఉండే నగరాల్లో ఉంటూ ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు.
ఇక హనీమూన్ కోసం జంటలు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు pick your trail పేర్కొంది. గతంలో హనీమూన్ ఖర్చు సగటున రూ. 2 లక్ష నుంచి రూ.2 రెండు లక్షల వరకు ఉండేది. కానీ ఇప్పుడు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. తమకు వచ్చే ఆదాయంలో ఐదు శాతం హనీమూన్ లేదా వినోదం కోసం ఖర్చు చేస్తున్నట్లు నివేదిక తెలుపుతోంది. అంటే ప్రస్తుతం ఉన్న జెన్ జెడ్ పీపుల్స్ ఎక్కువగా వ్యక్తిగత సంతోషం కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.