5G Mobiles: ఇప్పుడున్నదంతా టెక్నాలజీ యుగం. ప్రతీ పనిని సాంకేతికాన్ని ఉపయోగించి చేస్తున్నారు. ఏ పని చేయాలన్నా.. ఎవరితోనైనా కమ్యూనికేషన్ మెయింటేన్ చేయాలన్నా మొబైల్ తప్పనిసరి. కేవలం ఇతరులతో మాట్లాడడానికే కాకుండా ఫైల్స్, ఫొటోస్, వీడియోస్ షేర్ చేసుకోవడానికి స్మార్ట్ ఫోన్ ను ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారు. ఇటీవల 5G నెట్ వర్క్ అందుబాటులోకి రావడంతో అంతా 5G మొబైల్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా కంపెనీలు 5G మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అయితే అప్డేట్ ఫీచర్స్ కలిగి ఉండడంతో కొంచెం ఎక్కువ ధరతో విక్రయిస్తున్నారు. కానీ సామాన్యులను దృష్టిలో పెట్టుకొని ఇతర కంపెనీలు అంతే ఫీచర్స్ కలిగి తక్కువ ధరకు అమ్ముతున్నాయి. అలాంటి ఫోన్ల వివరాలేంటంటే..?
5000 ఎంఏహెచ్ బ్యాటరీ.. 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్, 33 ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సె్ అల్ట్రావైడ్ సెన్సార్ ను కలిగిన రెడ్ మీ నోట 12 ఇప్పుడు 5జీ నెట్ వర్క్ తో అందుబాటులో ఉంది. దీనిని రూ.16,999తో విక్రయిస్తున్నారు. 4 జనరేషన్ 1 ప్రాసెసర్ కలిగిన ఇది 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో పనిచేస్తుంది.
4జీ నెట్ వర్క్ తో వచ్చిన మోటో జీ మొబైల్స్ అత్యధికంగా అమ్ముడు పోయాయి. ఇప్పుడీ కంపెనీ మోటో జీ73 అనే మోడల్ ను 5జీ నెట్ వర్క్ తో మార్కెట్లోకి తీసుకొస్తుంది. మోటో జీ 73 స్మార్ట్ మొబైల్ ధర రూ.18,999కు విక్రయిస్తున్నారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కలిగిన ఈ మొబైల్ 6.5 ఎల్ సీడీ హెచ్ డీ డిస్ ప్లేతో కూడుకొని ఉంటుంది.
ఐక్యూ Z7:మోడల్ చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటుంది. 6.38 అంగుళాల 90Hz ఎమోల్డ్ డిస్ ప్లే దీని సొంతం. కెమెరా విషయానికొస్తే 64 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 16 ఫ్రంట్ కెమెరా ఉంది. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కలిగిన ఐక్యూ జెడ్ 7 ను రూ.18,999తో విక్రయిస్తున్నారు.
రియల్ మీ 10 Pro 5G 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు చేసే రియల్ మీ 10 ప్రో 5జీ 120 Hz రిఫ్రెస్ రేట్ తో ఎల్ సీడీ ప్యానెల్ ను కలిగి ఉంది. ఇందులో 695 ఎస్ వోసి ప్రాసెసర్ ఉంటుంది. దీనిని రూ.18,999తో అమ్ముతున్నారు.
వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ అనే మొబైల్ పై వాటి కంటే ఎక్కువే ధర. కానీ అద్భుతమైన ఫీచర్లు దీని సొంతం. 120 Hz రిప్రెష్ రేట్ తో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ ప్లస్ ఎల్ సీడీ డిస్ ప్లే ను కలిగి ఉంది. ఈ మోడల్ మాక్రో లెన్స్ 2 ఎంపీని కలిగి ుంది. 5000 ఎంహెచ్ బ్యాటరీ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ను కలిగిన ఈ మొబైల్ ను రూ.19,999కే విక్రయిస్తున్నారు.