Monsoon Visit Places: నిన్నా, మొన్నటి వరకు ఎండలు దంచి కొట్టాయి. 40 నుంచి 50 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కాలు బయటపెట్టాలంటే గజగజ వణికే పరిస్థితి. అయితే ప్రస్తుతం వాతావరణం చల్లబడ్డది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఈసారి నైరుతి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా ప్రస్తుతం అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే సాధారణంగా వేసవికాలంలో టూర్లకు వెళ్తుంటారు. కానీ వర్షాకాలంలో కొన్ని ప్రదేశాలు ఆహ్లదకరంగా మారుతుంటాయి. అ ప్రదేశాలు చూడ్డానికి రెండు కళ్లు చాలవన్నట్లుగా ఉంటాయి. మరి ఈ మాన్ సూన్ సీజన్లో ఎక్కడికి వెళ్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? ఆ వివరాలు మీకోసం..
మున్నార్:
కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో ఉంటుంది మున్నార్ హిల్ స్టేషన్. భూమికి సుమారు 1600 మీట్ల ఎత్తులో పశ్చిమ కనుమల పర్వత శ్రేణిలో ఉందీ ప్రదేశం. దీనిని దక్షిణ భారత కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. మున్నార్ లోని పూర్వపు కుందా వ్యాలీ రైల్వే 1924లో వచ్చిన వరదలో ధ్వంసమైంది. వర్షాకాలంలో ఈ ప్రదేశంలో అత్యంత ఆహ్లదకరంగా మారుతుంది.
మౌంట్ అబు:
పశ్చిమ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో సిరోహి జిల్లాలో ఉన్న ఆరావళి పర్వతాల్లో మౌంట్ అబు ఒక హిల్ స్టేషన్. ఇది 22 కిలో మీటర్ల పొడవు, 9 కిలోమీటర్ల వెడల్పుతో రాతి పీఠభూమి పై ఉంది. పర్వతం మీద ఎత్తైన శిఖరం గురు శిఖర్ సముద్ర మట్టానికి 1,722 మీటర్ల ఎత్తులో ఉంది. దీనిని ఎడారిలో ఓయాసిస్ అని పిలుస్తారు.
ఫ్లవర్ ఆఫ్ వ్యాలీ:
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర చంపోలి అనే ప్రాంతంలో ఫ్లవర్ ఆఫ్ వ్యాలీ కనిపిస్తుంది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వంగా గుర్తించింది. దీనిని నందాదేవి జాతీయ ఉద్యానవంగా పేరు మార్చారు. పర్వతారోహకులు బిల్ టిల్మాన్, నోయెల్ ఓడెల్ నందదేవి అనే వ్యక్తులు పర్వతానని అధిరోహించారు. పుష్పవతి నది ఒడ్డున ఇది వర్షాకాలంలో పూలు అలంకరించినట్లుగా ఉంటుంది.
గోవా బీచ్:
భారతదేశానికి పశ్చిమతీరాన అరేబియా సముద్రం ఉంటుంది. ఈప్రాంతాన్ని కొంకణ్ తీరం అని కూడా అంటారు. ఇక్కడి బీచ్ లు వర్షాకాలంలో అహ్లదకరంగా మారుతాయి. పచ్చని చెట్ల మధ్య సముద్రం నుంచి వచ్చే అలలు మనసును ఆకట్టుకుంటాయి.