Mango Benefits: పండ్లలో రారాజుగా మామిడిని పేర్కొంటున్నారు. ప్రతీ వేసవిలో పసుపు కలర్లో ఉండే ఈ పండ్లతో మార్కెట్ కళకళలాడుతుంది. మామిడి పండ్లు వేసవిలో మాత్రమే లభించడం వల్ల వీటిని చాలా మంది ఒక్కసారైనా టేస్ట్ చేస్తారు. మరికొందరు మాత్రం పెద్దగా పట్టించుకోరు. కానీ మామిడిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం రోజుకు ఒక్కసారైన మామిడిని తినడం వల్ల ఏన్నో పోషకాలు అందుతాయి. ఏ పండ్లలో లేని పోషకాలు ఇందులో లభిస్తాయి. అందువల్ల కొందరు వైద్యులు కూడా రెఫర్ చేస్తారు. ఇంతకీ మామిడిలో ఉండే పోషకాల గురించి తెలుసుకుందాం.
మనదేశంలో దాదాపు 20 రకాల మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తారు. వీటిలో దసరి, కేసరి, లాంగ్రా, చైసా ప్రసిద్ధి చెందాయి. అయితే మిగతా రకాల్లో కాస్త టేస్ట్ అటూ ఇటూ ఉన్నా పోషకాలు మాత్రం ప్రతీ మామిడిలో ఉంటాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో బెంగనపల్లి మామిడి ప్రసిద్ది. తినడానికి అనుగుణంగా ఉండే ఈ మామిడికి ఎక్కువ మంది ఆదరిస్తారు. అయితే ఈ మామిడి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటే?
భోజనం చేసిన కాసేపటి తరువాత మామిడిని తింటే జీర్ణవ్యవ్యస్థ సమస్యలు తొలిగిపోతాయి. ఇది జీర్ణ ఎంజైమ్ లు కలిగి ఉంటుంది. మామిడిలో నీరు, డైటరీ, ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో తిన్న ఆహారాన్ని వెంటే డైజెస్ట్ చేస్తుంది. భోజనం చేసిన తరువాత పండు తినాలనుకునేవారు మామిడి తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
మామిడి పండ్లలో సీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. సి విటమిన్ లోపంతో చర్మ వ్యాధులు వస్తాయి. మామిడి పండ్లు తినడం వల్ల సి విటమిన్ లోపం లేకుండా చేసుకోవచ్చు. ఇవి తినడం వల్ల మృతకణాలను సైతం తొలగించుకోవచ్చు. మామిడిలో ఉండే పోషకాలు గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ తో పాటు పొటాషియం, తదితర మూలకాలతో గుండెకు ఎలాంటి హాని చేయకుండా కాపాడుతాయి.
బరువు తగ్గాలనుకునేవారు మామిడి తింటే ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు. ఇందులో ఉండే ఫైబర్ బరువును పెరగకుండా చేస్తుంది. అధిక కొవ్వు దరిచేరకుండా కాపాడుతుంది. మామిడిలో పొటాషియం తో పాటు మెగ్నీషియం కూడా ఉంటుంది. దీంతో రక్తపోటు రాకుండా కాపాడుతుంది. మెగ్నీషియంతో థైరాయిడ్ కు సంబంధించిన సమస్యలను కూడా దూరం చేస్తుంది.