Mahaa News Vamsi: పాత్రికేయులకు వాగాడంబరం కంటే వాక్యాడంబరం, విషయాడంబరం ఉండాలి అంటారు. కానీ దురదృష్టవశాత్తు తెలుగు నాట మీడియాలో ఇది పూర్తిగా లోపించింది. విషయపరిజ్ఞానం కంటే అరవడమే ప్రధాన అర్హతగా మారిపోయింది. హిందీ నాట అర్ణబ్ గో స్వామి మాత్రమే అరుస్తాడు అని నిన్న మొన్నటి వరకు ఉండేది. అని తెలుగు నాట మీడియాలో ఆయనను మించిపోయేలా అరుస్తున్నారు. అరవడం అలా ఉంచితే న్యూట్రల్ గా ఉండాల్సిన జర్నలిస్టుల స్థానంలో ఒక పార్టీకి డప్పు కొడుతున్నారు. చూసే జనం దృష్టిలో అభాసు పాలవుతున్నారు.
ఎందుకు అలా
సాధారణంగా ఒక వార్త ఛానల్ చూస్తున్నప్పుడు.. ప్రేక్షకుడికి చూడాలి అనే భావన కలగాలి అంటే ముందుగా వార్తలు చెప్పే వారికి విషయ పరిజ్ఞానం ఉండాలి. భాష మీద పట్టు ఉండాలి. కనీసం భాష గురించి తెలిసి ఉండాలి. అప్పట్లో కె ఎల్ ఎన్ రావు, ప్రగతి, వరప్రసాద్, బద్రి, కరీం.. వంటి వారు మొత్తం ఇప్పటికీ గుర్తున్నారంటే.. వాళ్లు వార్తలు చెప్పడం మాత్రమే కాదు.. అందులో విషయసారాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా వివరించేవాళ్లు.. అందుకే ఈటీవీ ప్రైమ్ న్యూస్, టీవీ 9 న్యూస్ అప్పట్లో అంత క్లిక్ అయ్యాయి. జనాలకు చేరువయ్యాయి. ఇప్పుడు ఆ అలా ఉందా అంటే ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడిక టీవీ 5 సాంబశివరావు, ఏబీఎన్ వెంకటకృష్ణ, మహా న్యూస్ వంశీ.. వీరి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వార్తల పేరుతో ఒక వర్గానికి డప్పు కొట్టడంలో ఆరితేరిపోయారు. ముఖ్యంగా వైయస్ అవినాష్ రెడ్డి బెయిల్ కు సంబంధించి న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును తప్పు పట్టేంత స్థాయికి ఎదిగిపోయారు. వాస్తవానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ చేస్తోంది గాని.. ఈ న్యూస్ ఛానల్స్ స్టూడియోల్లో ఒక డిబేట్ పెడితే విషయం మొత్తం వెలుగు చూస్తుందనే భావన కలుగుతున్నది.
డప్పు కొట్టడం
వాస్తవానికి పైన చెప్పుకున్న మూడు చానల్స్ తెలుగుదేశం పార్టీకి డప్పు కొట్టడంలో ఆరి తేరిపోయాయి. పైగా ఈ మూడు న్యూస్ ఛానల్స్ కు సంబంధించిన న్యూస్ ప్రజంటర్లు విపరీతంగా అరుస్తున్నారు. ఎదుటివారికి ఏమాత్రం చెప్పే అవకాశం ఇవ్వడం లేదు. ఈ స్థాయిలో వీరు అరుస్తున్నారు వీళ్ళ చానల్స్ ఏమైనా టాప్ ర్యాంకుల్లో ఉన్నాయా అంటే అది కూడా లేదు. మొన్నటి దాకా టీవీ9 కు ఈ జాడ్యం ఉండేది. ఆ రుధిరం దేవి ఇప్పుడిప్పుడే సక్కగా వస్తోంది. నాలిక సరిగా తీరని రజనీకాంత్ తెలుగు స్పష్టంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎటొచ్చీ పిచ్చి తనమంతా ఆ పచ్చ చానల్స్ లోనే ఉంది.. చివరికి అవినాష్ బెయిల్ విషయంలో తీర్పు చెప్పిన న్యాయమూర్తికి అవినీతిని ఆపాదించిన చానల్స్ లో మహా టీవీ మాత్రమే క్షమాపణ చెప్పింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తన యజమాని లాగానే తప్పు చేసినా సమర్థించుకుంది. ఇంతటి దారుణం జరుగుతుంటే చూసే ప్రేక్షకులు న్యూస్ చానల్స్ పెట్టుబడిదారుల విష పుత్రికలు అని ఎందుకు అనుకోరు. కచ్చితంగా అనుకుంటారు. కాకపోతే వీరితో మన రాజకీయ నాయకులకు అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి చర్యలు దాదాపుగా ఉండవు. ఒక న్యాయమూర్తి “చర్యలు తీసుకోవాలా? వద్దా?” అనే నిస్సహాయతను వ్యక్తం చేశారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పచ్చ బ్యాచ్ ఆక్రందనలు pic.twitter.com/NxtPwdvkvB
— Political Punch (@PoliticalPunch9) June 1, 2023