Senior Citizen Savings Schemes: సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సేవింగ్స్ చేసుకుంటేనే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది. దీంతో చాలా మంది డబ్బును పలు మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ అనుకున్న విధంగా ఆదాయం రాకపోగా నష్టాలు చవిచూస్తుంటారు. దీంతో డబ్బును ఎక్కడ పెట్టాలో అర్థం కాక తలలు పట్టుకుంటారు. అయితే చాలా మంది తమ డబ్బు బ్యాంకులో ఉంటేనే సేఫ్ అని భావిస్తారు. అందుకే ఫిక్స్ డ్ డిపాజిట్లు చేస్తుంటారు. అయితే బ్యాంకులో కంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే పోస్టాఫీసుల్లో డబ్బు దాచుకున్నా అత్యధిక వడ్డీ వస్తుంది అని చాలా మందికి తెలియదు. ఇంతకీ పోస్టాఫీసుల్లో ఎంత శాతం వడ్డీ ఇస్తున్నారు? అసలేంటీ కథ?
పోస్టాఫీసుల్లో పలు పథకాల్లో పెట్టుబడి పెడితే అత్యధిక వడ్డీ వస్తుందని కొంతమందికి మాత్రమే తెలుసు. వీటిపై అవగాహన లేకపోవడంతో చాలా మంది పోస్టాఫీసుల్లో పెట్టుబడి పెట్టుబడి పెట్టడానికి ముందుకు రారు. కానీ 9 రకాల స్కీముల్లో డబ్బును ఇన్వెస్ట్ చేస్తే ఊహించని రికవరీ పొందుతారు. వీటిలో ప్రావిడెంట్ ఫండ్ , సుకన్య స్కీమ్, నేషనల్ సేవింగ్స్, టైమ్ డిపాజిట్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ వంటివి ఉన్నాయి.
2023 ఏప్రిల్ 1 నుంచి వడ్డీ రేట్లు మారిపోయాయి. దీంతో బ్యాంకుల కన్నీ పోస్టాఫీసుల్లోనూ అధిక వడ్డీని ఇస్తున్నారు. సుకన్య సమృద్ధి విషయానికొస్తే అత్యధికంగా 8 శాతం ఇస్తున్నారు. అయితే ఇది పదేళ్లలోపు ఆడపిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్స్ తమ డబ్బును దాచుకోవాలనుకుంటే 60 ఏళ్ల పైబడి ఉన్నవారు ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే 8.2 శాతం వర్తిస్తుంది. వీటితో పాటు నేషనల్ సేవింగ్స్ లో 7.7 వడ్డీని ఇస్తున్నారు.
ఇవే పథకాల్లో బ్యాంకుల్లో 3 నుంచి 7.1 శాతం వడ్డీని ఇస్తున్నారు. దీంతో బ్యాంకుల్లో కంటే పోస్టాఫీసుల్లో డబ్బును దాచుకోవడంతో మనీ సేఫ్ గా ఉండడంతో పాటు అధిక వడ్డీ రేటు వస్తుందని అంటున్నారు. ముఖ్యంగా పిల్లల భవిష్యత్ అవసరాలకు, సీనియర్ సిటిజన్స్ తమ అవసరాలకు ఉపయోగపడాలంటే మాత్రం ఇందులో పెట్టుబడి పెట్టడం మంచిదని సూచలను ఇస్తున్నారు.