https://oktelugu.com/

Adipurush New Song: ఒక్క పాటలో రామాయణం మొత్తం చూపించేసారుగా..సంచలనంగా మారిన ఆదిపురుష్ ‘రామ్ సీత రామ్’ వీడియో సాంగ్

చిత్రంలోని అద్భుతమైన విజువల్స్ ని ఈ పాటలో పొందుపరిచారు. గ్రాఫిక్స్ మరియు VFX వర్క్ చాలా సహజం గా అనిపించింది. సీత రాముడితో వనవాసం చేసిన ఘట్టం, రావణాసురుడి సీతని అపహరించి తీసుకెళ్లిన ఘట్టం తో పాటుగా రామసేతు నిర్మాణం వంటివి కూడా ఈ సాంగ్ లో చూపించారు.

Written By:
  • Vicky
  • , Updated On : May 29, 2023 / 04:22 PM IST

    Adipurush New Song

    Follow us on

    Adipurush New Song: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం వచ్చే నెల 16 వ తేదీన గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జూన్ 6 వ తారీఖున జరగబోతుంది. ప్రభాస్ ని శ్రీరాముడిగా వెండితెర మీద చూసేందుకు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

    ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్ మరియు ‘జై శ్రీరామ్’ లిరికల్ వీడియో సాంగ్ కి పాన్ ఇండియా లెవెల్ లో అద్భుతమైన రీచ్ వచ్చింది. ఈ రేంజ్ రెస్పాన్స్ ని మూవీ టీం కూడా ఊహించలేదు, ఎక్కడ చూసిన ‘జై శ్రీరామ్’ సాంగ్ వినిపిస్తూనే ఉంది. ఈరోజు ఈ చిత్రం లోని రెండవ పాట ‘రామ్ సీత రామ్’ వీడియో సాంగ్ విడుదలైంది. కాసేపటి క్రితమే విడుదలైన ఈ పాట కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

    చిత్రంలోని అద్భుతమైన విజువల్స్ ని ఈ పాటలో పొందుపరిచారు. గ్రాఫిక్స్ మరియు VFX వర్క్ చాలా సహజం గా అనిపించింది. సీత రాముడితో వనవాసం చేసిన ఘట్టం, రావణాసురుడి సీతని అపహరించి తీసుకెళ్లిన ఘట్టం తో పాటుగా రామసేతు నిర్మాణం వంటివి కూడా ఈ సాంగ్ లో చూపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘ఆదిపురుష్’ సినిమా మొత్తం ఎలా ఉండబోతుందో ఈ రెండు నిమిషాల 45 సెకండ్ల వీడియో సాంగ్ లో చూపించేసారు డైరెక్టర్ ఓం రౌత్. టీజర్ విడుదలైనప్పుడు ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి చాలా తీవ్రమైన ట్రోలింగ్స్ వచ్చాయి.

    500 కోట్లు ఖర్చు చేసి ఇలాంటి కార్టూన్ బొమ్మల సినిమాని తీస్తారా అంటూ ఫ్యాన్స్ నుండి తీవ్రమైన నెగటివిటీ ని ఎదురుకుంది టీం. దీనిని ఒక ఛాలెంజ్ గా తీసుకొని డైరెక్టర్ ఓం రౌత్ VFX పై మరోసారి రీ వర్క్ చేసాడు. దాని ఔట్పుట్ ని ఈరోజు మనమంతా చూస్తున్నాము. ఇక వెండితెర మీద ఈ చిత్రాన్ని చూస్తున్నప్పుడు ఎలాంటి అనుభూతి కలగబోతుందో తెలియాలంటే వచ్చే నెల 16 వ తేదీ వరకు ఆగాల్సిందే.