Marriage Tests: ప్రస్తుత కాలంలో చాలామంది పెళ్లికి ముందు జీవితం ఎలా గడిపినా పెళ్లి తర్వాత సంతోషంగా జీవించాలని భావిస్తున్నారు. దేశంలో సంవత్సరాలు గడుస్తున్నా ప్రేమ పెళ్లిళ్లతో పోలిస్తే అరేంజ్ మ్యారేజ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. పెద్దలు పెళ్లి చేసే సమయంలో పెళ్లి చేసుకోబోయే వ్యక్తి యొక్క చదువు, ఉద్యోగం, అలవాట్లు, ఇతర వివరాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారనే సంగతి తెలిసిందే.
అయితే పెళ్లికి ముందు వధూవరులు ఖచ్చితంగా కొన్ని పరీక్షలు చేయించుకుంటే మంచిది. పరీక్షలు చేయించుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. కొంతమంది పెళ్లికి ముందే లైంగిక సంబంధాలను కలిగి ఉంటారు. అలాంటి వాళ్లు కొన్ని వ్యాధుల బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయి. లైంగికంగా సంక్రమించే వ్యాధి పరీక్ష చేయించుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.
Also Read: చిక్కుల్లో మంత్రి అప్పలరాజు.. పోలీసు అధికారిపై దుర్భషలాడటంపై సర్వత్రా విమర్శలు..!
పెళ్లికి ముందు కచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్షలలో వంధ్యత్వ పరీక్ష కూడా ఒకటి. స్త్రీల అండాశయ ఆరోగ్యంతో పాటు పురుషుల స్పెర్మ్ కౌంట్ ను కూడా ఈ పరీక్షల ద్వారా తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పెళ్లికి ముందు బ్లడ్ గ్రూప్ కు సంబంధించిన పరీక్ష కూడా చేయించుకోవాలి. ఇద్దరి బ్లడ్ గ్రూప్ అనుకూలంగా ఉంటే పెళ్లి తర్వాత ఎలాంటి ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉండవని చెప్పవచ్చు.
పెళ్లికి ముందు జన్యువ్యాధి పరీక్ష చేయించుకుంటే కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు. జన్యుపరమైన వ్యాధులు తర్వాత తరాలకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వైద్యనిపుణులను సంప్రదించడం ద్వారా జన్యు సంబంధిత వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
Also Read: వైరల్ గా మారిన ఐఏఎస్ ప్రేమ.. స్కూల్ టీచర్ తో ఇలా..!