Minister Appalaraju: రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా బాధ్యతతో వ్యవహరించాలి. ఏ కొంచెం టంగ్ స్లిప్ అయినా సరే దాన్ని పట్టుకుని అటు ప్రతిపక్షాలు, ఇటు మీడియా ఆడేసుకుంటుంది. దీంతో ఇబ్బదుల్లో పడిపోతారు. ఇప్పుడు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు పరిస్థితి కూడా ఇలాగే వివాదాస్పదంగా మారిపోయింది. ఆయన ఓ పోలీస్ ఆఫీసర్‌ను బూతులు తిట్టారని ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయిపోయింది. దీనిపై పెద్ద దుమారమే రేగుతోంది.
ఈ వీడియోపై అటు ప్రతిపక్షాలు, ఇటు నెటిజన్లు పెద్ద ఎత్తున సీరియస్ అవుతున్నారు. మంత్రి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. విశాఖ పట్నంలో జగన్ పర్యటన సందర్భంగా అక్కడ డ్యూటీ చేస్తున్న పోలీసు అధికారిపై ఇలా మాటలు అనడంపై అటు పోలీసు అధికారు సంఘం కూడా సీరియస్ అయింది. మంత్రిగా ఉన్న ఆయన ఇలాంటి మాటలు అనడం దురదృష్టకరం అని సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: జగన్ సర్కార్ కు ఫిర్యాదుల టెన్షన్.. సీన్ రివర్స్ అయ్యిందే..!
ఈ ఘటనను రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఖండిస్తూ వెంటనే ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ విచారణ జరపాలంటూ కోరింది. అంతే కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకుని, భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా చూడాలంటూ కోరింది. అయితే ఈ ఘటనపై టీడీపీ రంగంలోకి దిగింది. సోషల్ మీడియా ఖాతాల్లో ఈ వీడియోను పోస్టు చేస్తూ మంత్రి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది టీడీపీ. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇదే విషయంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఇందులో భాగంగా అటు డీజీపీకి కూడా లెటర్ రాశారు. రూల్ ప్రకారం మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అయితే మంత్రి చేసిన కామెంట్లు ఇప్పుడు ఆయన్ను ఇబ్బందుల్లో పడేశాయి. అయితే గతంలో ఇలాంటివి అడపా దడపా తెరమీదకు వచ్చినా.. వైసీపీ నేతలపై చర్యలు శూన్యం. మరి ఇప్పుడు కూడా ఇలాగే లైట్ తీసుకుంటారా.. లేదంటే జగన్ ఏమైనా దీని మీద స్పందిస్తారా అన్నది మాత్రం వేచి చూడాలి.
Also Read: ఏపీలో కొత్తగా పెరిగిన టికెట్ల రేట్లు ఇలా ఉన్నాయి..!