4 principles for success: ఒక విజయవంతమైన వ్యక్తి తనకున్న పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటాడు. అయితే అతను ఇలా మార్చుకోవడానికి ముందు కొన్ని విషయాలను తెలుసుకుంటాడు. అవి జీవితంలో గెలవడానికి ఎంతో ఉపయోగపడతాయి. ప్రతి మనిషికి ఆరోగ్యం.. ఉద్యోగం.. వ్యాపారం.. విద్య ఎంత అవసరమో మోటివేషన్ కూడా అంతే కచ్చితంగా అవసరం. ఎందుకంటే ఒక్క మాటతో ఒక వ్యక్తిలో కదలికను చేయవచ్చు. కొన్ని మాటలతో ఒక వ్యక్తిని విజయవంతంగా నిలబెట్టవచ్చు. అలా స్ఫూర్తి నింపే విషయాలు చాలా అవసరం. అలాంటి వారి కోసం ముఖ్యమైన ఈ ఐదు సూత్రాలు.. వీటిని కనుక పాటిస్తే కచ్చితంగా విజయం మీ సొంతం అవుతుంది. మరి అవేంటంటే?
కాదు.. అనకూడదు..:
కొందరికి ఒక పని చేయడానికి ఉత్సాహం ఉంటుంది. ఉదాహరణకి ఒక విద్యార్థి కలెక్టర్ కావాలన్నా కోరిక కలుగుతుంది. కానీ కొంతమంది తల్లిదండ్రులు మాత్రం ఇంజనీరింగ్ లేదా సాఫ్ట్వేర్ వంటి వాటి వైపు వెళ్లాలని సూచిస్తారు. వాస్తవానికి విద్యార్థి కి ఇష్టం ఉన్న కలెక్టర్ చదివితే తనకున్న ప్లాన్ లేదా ఇతర మార్గాల ద్వారా ప్రయత్నాలు చేయవచ్చు. కలెక్టర్ కాకుండా కనీసం ఆ స్థాయి వరకు వెళ్లవచ్చు. అయితే ఇలాంటి వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. అది సాధ్యమయ్యే పని కాదు అనే మాట అనకూడదు.
తెలియకుండానే వాకింగ్:
ఒక వ్యక్తి విజయం సాధించడానికి ఆరోగ్యం కూడా చాలా అవసరం. అయితే ప్రత్యేకంగా ఆరోగ్యం కోసం సమయం కేటాయించని వారు.. కొన్ని పనుల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఉదాహరణకు ఒక సూపర్ మార్కెట్ కు వెళ్లారని అనుకోండి. ఇక్కడ బుట్టిని చేతిలో పట్టుకొని సరుకులు తీసుకోవద్దు. బుట్టిని ఒక ప్రదేశంలో ఉంచి వివిధ రాక్ లలో ఉన్న వస్తువులను తీసుకువచ్చి ఆ బుట్టలో వేసుకుంటూ ఉండాలి. ఇక్కడ తెలియకుండానే వాకింగ్ చేసిన వారవుతారు. ఇలాగే దగ్గరలో ఉంటే మార్కెట్ కు.. కిరాణం షాప్ నకు సాధ్యమైనంతవరకు నడిచే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది.
ఎవరికి వారే గొప్ప:
ఈ ప్రపంచంలో ఎవరికి వారే గొప్ప వ్యక్తి అన్న విషయం చాలామంది తెలుసుకోరు. ఎప్పుడూ ఇతరులు విజయం సాధిస్తే.. వారి గురించి ఆలోచిస్తారు. వారి విషయంలో ఎక్కువగా ఆలోచించినా.. వారు ఎలా విజయం సాధించారు? అన్నది మాత్రం తెలుసుకుంటే సరిపోతుంది. అలాకాకుండా వారి విజయాన్ని చూస్తూ ఊరుకోవద్దు. ప్రతి వ్యక్తిలో ఉన్న గొప్పతనాన్ని వెలికి తీసే ప్రయత్నం చేయాలి. వారి కంటే మేమే గొప్ప అన్న విధంగా ముందుకు వెళ్లాలి.
మీరు ఉండే సమాజం ఎలాంటిది?
కొందరు తమ చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మారుతారు. అలాంటప్పుడు మీరు విజయం కోసం ఆరాటపడే వ్యక్తితో కలిసి ఉంటున్నారా? లేదా ప్రతి పనికి అడ్డు చెప్పే సమూహంలో ఉంటున్నారా? అనేది తెలుసుకోవాలి. లక్ష్యం వైపు వెళ్లాలి.. ఏదో ఒకటి సాధించాలి అన్న గ్రూపులో మీరు ఉంటే కచ్చితంగా వారితో పాటు మీరు కూడా విజయం సాధిస్తారు.