Relationship: భర్తను సంతోషంగా ఉంచాలంటే భార్య చేయాల్సిన పనులివీ

ఈ మధ్య జరిగే పెళ్లిల్లు పెటాకులు అవడమే ఎక్కువ. ప్రేమ పెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా మూడు నాళ్ల ముచ్చట లాగే సాగుతున్నాయి. కష్టమైన నష్టమైన కలిసి బతుకుదామని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసుకున్న ఆ జంటలు విడిపోవడానికి కారణాలు చాలా చిన్నవే.

Written By: Swathi, Updated On : March 12, 2024 10:56 am

Relationship

Follow us on

Relationship: ఏడడుగులు వేసి మూడు ముళ్ళతో ఒకటయ్యే బంధమే భార్యాభర్తల బంధం. అప్పటి వరకు బ్యాచ్ లర్ లైఫ్. నో టెన్షన్స్, ఎంజాయ్, జాలీ లైఫ్ వీటితోటే గడిపిన యువత ఒక్కసారిగా పెళ్లి అనే బంధంతో ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతారు. ఇంద్రధనస్సులో రంగుల లాగా మా జీవితం ఉండాలని ఇద్దరు ఆశిస్తారు. ఇద్దరికి రెండు వేరు వేరు ప్రపంచాలు కానీ పెళ్లి తర్వాత ఒక ప్రపంచంగా బతకాలి. ఇద్దరికి ఎన్నో కలలు. ఆ కలలను నిజం చేసుకునేలా అడుగులు వేయాలి. కానీ పెళ్లి తర్వాత ఏం జరుగుతుంది.

ఈ మధ్య జరిగే పెళ్లిల్లు పెటాకులు అవడమే ఎక్కువ. ప్రేమ పెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా మూడు నాళ్ల ముచ్చట లాగే సాగుతున్నాయి. కష్టమైన నష్టమైన కలిసి బతుకుదామని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసుకున్న ఆ జంటలు విడిపోవడానికి కారణాలు చాలా చిన్నవే. కేవలం అపార్థం అనే కలపు మొక్కను తీసి అర్థం చేసుకోవడం అనే గులాబీ చెట్టును నాటితే ఎన్ని ముల్లులు ఉన్నా.. అందమైన గులాబీలా మీ జీవితం ఉంటుంది. అయితే కొన్ని సార్లు భార్య భర్తను గెలుచుకోవడానికి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది.

భార్యలు కాస్త భర్త గురించి ఆలోచించాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి సంతోషం లేకుండా కుటుంబం కోసం కష్టపడి వచ్చే భర్తకు ఏది ఇష్టం? ఎలా ఉంటే తన మనసు హాయిగా ఉంటుంది అని ఆలోచించాలి. పొద్దున నుంచి సాయంత్రం వరకు జిడ్డు మొహంతో ఉన్నా ఆయన వచ్చే సమయానికి కాస్త అందంగా తయారవ్వాలి. రోజు అంటే కుదరకపోయినా.. అప్పుడప్పుడు తనకు ఇష్టమైన ఫుడ్ ను వండి పెట్టాలి.ఆయన చిరాకులో ఉన్నప్పుడు అర్థం చేసుకొని కారణం తెలుసుకోవాలి. దాని నుంచి బయట పడేలా ప్రయత్నం చేయాలి.

ఎన్ని టెన్షన్ లు ఉన్నా ఇంటికి రావాలి అనుకోవాలి కానీ.. ఇంటికి వెళ్తే మరింత టెన్షన్ అనుకోకూడదు. ఇంటికి రాగానే మీ అమ్మ అలా చేసింది. మీ చెల్లి ఇలా చేసింది అంటూ బుర్ర నిండా టెన్షన్ లు పెట్టకుండా.. కాస్త ఆయన మనుసుకు రిలాక్ష్ అయ్యేలా కబుర్లు చెబుతూ.. లేదా ఆయన చెప్పే కబుర్లు వింటూ ఉండాలి. వీలైనంత వరకు హ్యాపీ లైఫ్ ను కోరుకోవాలి. దాని కోసం ఆలోచించాలి. కానీ అస్తమానం టెన్షన్ లు గొడవలు అంటూ మీ జీవితాన్ని, ఆయన జీవితాన్ని నరకయాతనలా మిగల్చకండి. ఉండేది ఒక జీవితం సో బీ హ్యాపీ..