Low Budget Car: లో బడ్జెట్ లో కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్..

దేశంలో కార్ల ఉత్పత్తిలో మారుతి అగ్రగామిలో ఉంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన బ్రెజ్జా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అయితే దీనిని 2024లో కాంపాక్ట్ ఎస్ యూవీగా మార్చి మార్కెట్లోకి ప్రవేశపెట్టారు.

Written By: Srinivas, Updated On : March 12, 2024 10:55 am

Maruthi Brezza

Follow us on

Low Budget Car:ప్రతీ ఒక్కరూ నేటి కాలంలో సొంత వెహికల్ ఉండాలనుకుంటున్నారు. అందులోనూ 4 వీలర్ అయితే కుటుంబ సభ్యులంతా కలిసి ప్రయాణించవచ్చని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచి కారు కొనుగోలు చేయాలని చూస్తున్నారు. అయితే ఎంత కారు కొనాలని ఉన్నా దాని కోసం తక్కువ బడ్జెట్ వెచ్చించాలని భావించేవారు చాలా మందే ఉన్నారు. వీరి కోసం కంపెనీలు తక్కువ ధరకే వెహికల్స్ ను అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో మారుతి కంపెనీ కార్లు మిడిల్ క్లాస్ పీపుల్స్ ను మరింతగా ఆకట్టుకుంటాయని అంటారు. అయితే మారుతి సుజుకీ లేటేస్టుగా వీరికి గుడ్ న్యూస్ చెప్పింది. అతి తక్కువ బడ్జెట్ లో లభించే కారు గురించి చెప్పింది. ఆ వివరాల్లోకి వెళితే..

దేశంలో కార్ల ఉత్పత్తిలో మారుతి అగ్రగామిలో ఉంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన బ్రెజ్జా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అయితే దీనిని 2024లో కాంపాక్ట్ ఎస్ యూవీగా మార్చి మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఈ విబాగంలో మిగతా వాటిల్లో కంటే బ్రెజ్జాలో సేప్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు EBD, ABS బ్రేకింగ్ సిస్టమ్ ను అమర్యారు. దీంతో వీల్ లాక్ ఆఫ్ నిరోధించడం, సరైన స్టాంగ్ పవర్ నిర్దారించడం వంటివి చేస్తుంది. అలాగే స్టెబిలిటీ కంట్రోల్ ద్వారా ఆకస్మికంగా మలుపాల్సి వచ్చినప్పుడు స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది.

ఈ కారు స్పెషిఫికేషన్ విషయానికొస్తే. 1.5 లీటర్ కె సిరీస్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 103 బీహెచ్ పీ పవర్, 138 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. హైవే ప్రయాణాయాల్లో సులభంగా వెళ్లేందుకు అనుగుణంగా ఉండే ఇది లీటర్ కు 20 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిసణ్ తో 18 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. కంపాక్ట్ ఎస్ యూవీ విభాగంలో మిగతా కార్లకు బ్రెజ్జా గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు.

ఇక ఈ కారు ధర విషయానికొస్తే రూ.8 లక్షల ధర ఎక్స్ షోరూం ధర ఉంది. ఆన్ రోడ్ కొచ్చేసరికి రూ.12 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ కారు ఎక్స్ షోరూం ధర ర.10 లక్షలకు పై మాటే వినిపిస్తుంది. బ్రెజ్జాలో ఫీచర్స్ అద్భుతంగా ఉన్నాయి. స్మార్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మ్యూజిక్ స్ట్రీమింగ్, స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ మద్దతు ఇచ్చే యూజర్ ఫ్రెండ్లీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ తో ప్రయాణికులు సురక్షితంగా ఉండవచ్చు. దూరపు ప్రయాణాలు చేసేవారికి ఈ కారు అనుకూలంగా ఉంటుందని అంటున్నారు.