Silence : కొందరు ఎక్కువగా మాట్లాడుతుంటే.. మరికొందరు చాలా నిశ్శబ్దంగా (Silent) ఉంటారు. అసలు వీళ్లకి పెద్దగా మాట్లాడటం ఇష్టం ఉండదు. ఏదో పని ఉంటేనే ఇతరులతో మాట్లాడతారు. అంతే కానీ ఖాళీగా ఉన్నామని అసలు వీళ్లు ఇతరులతో మాట్లాడరు. అయితే ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా (Alone) ఉంటే చాలా నష్టాలు ఉన్నాయని చాలా మంది అనుకుంటారు. కానీ రోజులో కనీసం గంట పాటు (One Hour) అయిన ఎవరితో మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రోజుల్లో సైలెంట్‌గా ఉండే వారి కంటే ఇతరులతో ఏదో విధంగా మాట్లాడుతూ.. టైమ్ పాస్ చేసే వాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువగా మాట్లాడటం కంటే సైలెంట్‌గా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మీకు తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.
మానసిక ఆరోగ్యం
రోజంతా కాలేజీ, స్కూల్, ఆఫీస్ ఇలా మాట్లాడుతూనే ఉంటారు. అయితే కనీసం గంట పాటు అయిన కూడా రోజులో ఏం మాట్లాడకుండా ఉంటే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట. మానసిక ఆరోగ్యం ఎంత బాగుంటే మీరు అంత సంతోషంగా ఉంటారు. లేకపోతే మళ్లీ శారీరక సమస్యలు కూడా వస్తాయి.
ఆందోళన తగ్గడం
రోజులో గంట పాటు నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఒత్తిడి, ఆందోళన అన్ని కూడా తగ్గుతాయి. ఏ విషయానికి ఎక్కువగా టెన్షన్ తీసుకోకుండా చాలా సైలెంట్‌గా ఉంటారు. కూల్‌గా ప్రతీ విషయాన్ని కూడా సాల్వ్ చేయగలరు.
క్రియేటివిటీ పెరుగుతుంది
ఎక్కువగా మాట్లాడటం కంటే తక్కువగా మాట్లాడటం వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది. ఏ పనిని అయినా కూడా ఈజీగా చేసేయగలరు. అందరిలా కాకుండా కొత్తగా చేయగలరు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
కమ్యూనికేషన్ పెరుగుతుంది
సైలెంట్‌గా ఉండటం వల్ల ఇతరులతో కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఎలాగంటే సైలెంట్‌గా ఉంటే ఇతరులు చెప్పే మాటలు చాలా శ్రద్ధగా వినగలరు. దీంతో ఇద్దరి మధ్య బాండ్ పెరుగుతుంది. ఇతరులతో కమ్యూనికేషన్ ఎంత బాగుంటే ఇద్దరి మధ్య రిలేషన్ ఉంటుంది. అది ఏ బంధంలో అయినా కూడా మాట్లాడటమే కాకుండా ఇతరులు చెప్పేది కూడా వినాలి. దీనివల్ల ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది.
రక్తపోటు అదుపులో ఉంటుంది
మౌనంగా ఉండటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. దీంతో గుండెపోటు వచ్చే ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వీటితో పాటు నిద్రలేమి సమస్య కూడా క్లియర్ అవుతుంది. ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారు రోజులో ఒక గంట పాటు సైలెంట్‌గా ఉండటం నేర్చుకోండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.