Fake Medicines: మనదేశంలో ఔషధాల తయారీలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. సామాన్యుడికి అర్థం కాని విధంగా మందులు తీసుకొచ్చి కలవరపెడుతున్నారు. మార్కెట్ లో నాసిరకం, నకిలీ, కల్తీ మందులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం లేకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో మన దేశంలో అధికార యంత్రాంగం ఏం చేస్తుంది అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నా అధికార యంత్రాంగం మొద్దు నిద్ర పోతోంది. ఫలితంగా మందులు నాసిరకంగానే ఉత్పత్తి అవుతున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

గాంబియా, ఇండోనేషియా వంటి దేశాల్లో చిన్ని పిల్లలకు ఇచ్చిన మాత్రలు వికటించి ఎంతో మంది చనిపోయిన ఘటనలు కూడా ఉండటం గమనార్హం. అంటే నకిలీ మందుల వ్యవస్థ ఎంతగా పాతుకుపోయిందో అర్థమవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన ఆధారాల ప్రకారం ప్రపంచంలో దాదాపు 35 శాతం మందులు నకిలీవి ఉంటున్నాయని తెలిపింది. దీంతో ఔషధాల తయారీలో ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థమవుతోంది. ఏ దేశంలో అయినా మందుల తయారీలో మంచి నాణ్యత పాటించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
గ్లోబలైజేషన్ విధానంలో మార్కెటింగ్ వ్యవస్థకు ద్వారాలు తెరవడంతో ఔషధాల తయారీలో నాణ్యత కొరవడుతోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మనం తయారు చేసిన మందులను ఇతర దేశాలకు సరఫరా చేసే విషయంలో కూడా దేశానికి దేశానికి మధ్య కొన్ని లోపాలు ఉండటంతో మందుల నాణ్యతపై దృష్టి సారించలేకపోతున్నామని చెబుతున్నారు. ప్రతి దేశంలో ఔషధ తయారీ సంస్థకు లైసెన్స్ లు జారీ చేసే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటే నకిలీ మందులు రాకుండా నిరోధించొచ్చు.

భారతదేశంలో ఔషధాల తయారీ సంస్థలు పెరిగాయి. కరోనాకు కూడా మనమే టీకా తయారు చేసుకోవడం గమనార్హం. ఇలా కొన్ని విషయాల్లో మనం నెంబర్ వన్ గా ఉన్నా ఇతర జబ్బుల విషయంలో ఔషధాల తయారీపై ప్రభుత్వం అజమాయిషీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఔషధాల వ్యవస్థలో కొన్ని లోపాలున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిన్న చిన్న అవస్థలకు కూడా మనవారు మందులు వేసుకోవడం అలవాటు చేసుకున్నారు. దీంతో ఏవి నకిలీవో? ఏవి అసలువో తెలుసుకోవాల్సిన బాధ్యత వినియోగదారులపై కూడా ఉంది.
మందుల వాడకంపై జాగ్రత్తలు వహించాలి. టాబ్లెట్ షీట్ పై ఉన్న వివరాలు బేరీజు వేసుకోవాలి. అందులో ఏదైనా అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి. సదరు సంస్థ నాణ్యతపై నిలదీయాలి. అప్పుడే మనకు నకిలీ మందులు లేకుండా అవుతాయి.