Palmistry: చాలామంది జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతుంటారు. ముఖ్యంగా చేతి రాతను బట్టి తమ తలరాత ఉంటుందని ఎంతో మంది నమ్మకం. ఆ రేఖలను చూసి జ్యోతిష్యులు ఏం చెప్పినా సరే అది నమ్ముతుంటారు. అయితే అరచేతిలో x అనే గుర్తు ఉంటే వారు తిరుగులేని రారాజుగా వెలుగొందుతారని ఇప్పుడు వెల్లడయింది. మాస్కోలోని ఎస్ టి ఐ సైంటిస్టులు ఈ x అనే గుర్తు అరచేతిలో ఉన్న వ్యక్తులపై కొన్ని పరిశోధనలు చేశారు.

అందులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ గుర్తు ఉన్న వారు ఎంతో ప్రతిభావంతులుగా ఉంటారని, సంచలన విజయాలకు వారు పెట్టింది పేరుగా వెలుగొందుతారని సైంటిస్టులు చెబుతున్నారు. ఇందులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్, అలెగ్జాండర్ లాంటి వారి చేతుల్లో కూడా ఈ గుర్తు ఉండటం విశేషం. దాన్నిబట్టి వారు ప్రపంచాన్ని జయించగలిగే సామర్థ్యం ఉన్న వారుగా సైంటిస్టులు చెబుతున్నారు.
అలెగ్జాండర్ చేతిలో ఈ గుర్తు ఉన్నందునే అతను ప్రపంచాన్ని జయించాడని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ గుర్తు ఉన్న వారిలో నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయని, ఎదుటి వారిని ఓడించడంలో వీరు దిట్టలు అని చెబుతున్నారు. ఎలాంటి వ్యూహాలు లేకపోయినా కూడా శత్రువులను ఓడించగల సామర్థ్యం వీరికి ఉంటుంది. అవతలి వ్యక్తి బలాన్ని, సామర్థ్యాన్ని కూడా వీరు సులభంగా అంచనా వేయగలుగుతారట.
Also Read: AP Politics: జనసేనతోనే పొత్తు.. టీడీపీకి సోము షాక్.. పవన్ మాటేంటి..?
పది మందిని వీరు విజయపథంలో నడిపించగలుగుతారు. పైగా వీరు శారీరకంగా ఎంతో దృఢంగా ఉంటారట. మానసికంగా కూడా వీరు మిగతా వారి కంటే చాలా ఆరోగ్యంగా ఉంటారని, వీరిని బోల్తా కొట్టించడం అసాధ్యమని సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. ఇక మరో విషయం ఏంటంటే.. ఎలాంటి అంటు రోగాలు కూడా వీరి దరిచేరవు. వీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, చాలా బలిష్టంగా ఉంటారు. ప్రపంచాన్ని జయించిన అతి కొద్ది మంది నాయకుల్లో ఈ గుర్తు ఉన్న వారు ఎక్కువగా ఉండటం విశేషం.
Recommended Video: