Cruel Wife: కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుంది అంటారు. భార్యాభర్తల బంధంలో ఎన్నో అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయి కానీ రానురాను మానవ సంబంధాలు కాస్త ఆర్థిక బంధాలుగా మారుతున్నాయి. తల్లి కడుపు చూస్తుంది భార్య జేబు చూస్తుందంటారు. భార్యలకు ఎప్పుడు సంపాదన మీదే ధ్యాస ఉంటుంది. భర్త బాగా సంపాదిస్తే గౌరవం ఇస్తారు. లేదంటే నిరాదరణగా చూస్తారు. ఇది అందరి విషయంలో కాదు డబ్బు మీద పిచ్చి ఉన్న వారికే వర్తిస్తుంటుంది.

డబ్బున్నా లేకపోయినా ఉన్న దాంట్లో హాయిగా జీవించే వారు ఎందరో ఉన్నారు. కానీ చాలా మంది మాత్రం సంపాదనపైనే ఆలోచిస్తుంటారు. ఈ నేపథ్యంలో రాజస్తాన్ రాష్ట్రంలోని బార్మర్ ప్రాంతంలోని బాటియాలో అనిల్ కుమార్, మంజు భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. అనిల్ కుమార్ ఓ ప్రైవేటు కంపెనీలో తక్కువ జీతానికి పని చేస్తున్నాడు.
Also Read: అఖండ వర్సెస్ పుష్ప వర్సెస్ భీమ్లానాయక్.. తొలి వారం ఎవరి కలెక్షన్లు ఎంతంటే?
దీంతో డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇద్దరు కూడా మద్యం సేవించేవారని తెలుస్తోంది. సంపాదన తక్కువగా ఉండటంతోనే ఇద్దరు అప్పుడప్పుడు గొడవలకు దిగేవారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో రగడ రేగడంతో మాటమాట పెరిగింది. ఇక ఆగలేని భార్య మంజు అనిల్ ను బెల్టుతో చంపేసింది.

డబ్బు కోసం కట్టుకున్న వాడినే కడతేర్చింది. చుట్టుపక్కల వారు వచ్చే సరికి భర్త శవం పక్కనే నిలబడి ఉంది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి విచారణ చేసి భార్యను అదుపులోకి తీసుకున్నారు. హతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఆమెను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కానీ ఈ హత్యలో ఇంకా ఏదైనా కోణం దాగి ఉందా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
భార్య ఒక్కతే హత్య చేసిందా లేక ఆమెకు ఎవరైనా సహకరించారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. నిందితురాలు కాల్ లిస్ట్ పై కూడా ఆరా తీస్తున్నారు. ఆమెకు అతడికి ఉన్న సంబంధాలు ఏమైనా ఉన్నాయా అని కూడా ఆలోచిస్తున్నారు. దీంతో కట్టుకున్న వాడిని కడతేర్చిన భార్య చివరకు కటకటాలపాలైంది. మద్యం మత్తులో భర్తనే చంపిన ఆమెను అందరు చీదరిస్తున్నారు.
Also Read: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర