India vs South Africa 1st T20: టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య టీ20 మ్యాచ్ నేడు ప్రారంభం కానుంది. దీనికి రెండు జట్లు కసరత్తులు చేశాయి. పైచేయి సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. మూడు మ్యాచ్ ల సిరీస్ లో ప్రత్యర్థిని కట్టడి చేసి విజయం సాధించాలని భావిస్తున్నాయి. దీని కోసం అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో కప్ సాధించిన టీమిండియా సఫారీలను సైతం ఎదర్కొనేందుకు సిద్ధమవుతోంది.

టీమిండియాలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బౌలింగ్ లో లోపాలు ప్రధానంగా బయటపడుతున్నాయి. ఆసీస్ తో జరిగిన సిరీస్ లో మనవారి బలహీనతలను కంగారూలు క్యాష్ చేసుకోవడంతో అధిక స్కోరు చేసిన సంగతి తెలిసిందే. ఏదో మన అదృష్టం కలిసి రావడంత విజయం సాధించాం. కానీ ఒకవేళ ఓటమి పాలయితే మన వారి మీద విమర్శలు వచ్చేవి. మన వారి బౌలింగ్ నైపుణ్యత ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో టీమిండియా ఇంకా బౌలింగులో పట్టు సాధించాల్సిన సమయం వచ్చింది.
Also Read: Director Venu Sriram: కుదిరితే బన్నీతో.. కాదనుకుంటే వరుణ్ తేజ్ తో.. ప్లాన్ అదిరింది !
వచ్చే నెలలో టీ20 ప్రపంచ కప్ ఉండటంతో కొందరు క్రీడాకారులకు విరామం ఇచ్చారు. దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచులకు జట్టును ప్రకటించారు. ఇందులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, కోహ్లి, సూర్యకుమార్, పంత్, దినేష్ కార్తీక్, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, బుమ్రా, ఉమేశ్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, షాబజ్ అహ్మద్ లను ఎంపిక చేసింది. దీపక్ హుడా, హార్థిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ లకు విశ్రాంతి ఇచ్చింది. దీంతో సఫారీలను ఎదుర్కోవడం టీమిండియాకు సాధ్యపడుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి.

కీలక ప్లేయర్లు దూరం కావడంతో టీమిండియా మూడు టీ20 మ్యాచ్ ల్లో దక్షిణాఫ్రికాను ఢీకొనే క్రమంలో విజయం సాధిస్తుందా? లేక వారి శక్తియుక్తులకు దాసోహం అంటుందా అనేదే సందేహంగానే ఉంది. దీంతో నేటి నుంచి ఆరంభమయ్యే మ్యాచ్ లో సఫారీలను ఎలాగైనా ఎదుర్కొని కప్ సాధించాలని భావిస్తోంది. ఇందుకోసం అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. సఫారీలను తక్కువ స్కోరుకే కట్టడి చేసి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. టీమిండియా కోరిక తీరుతుందా? లేక సఫారీల కల తీరుతుందా అనేది తేలాలంటే ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
Also Read: JanaSena: పవన్ కళ్యాణ్ కి గ్రౌండ్ క్లియర్ చేస్తున్న జనసైనికులు