https://oktelugu.com/

Life Story : లాటరీలో 20 కోట్లు.. లైఫ్ అంతా బిందాస్ అనుకుంది.. కానీ ఆ తర్వాతే విధి తనతో ఆడుకుంది..

జీవితం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. ఒకే విధంగా ఉంటే అది జీవితం కాదు. కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగవు. ఇంకొన్నిసార్లు మనం జరగొద్దనుకున్నవి జరగక మానవు. దీనినే వేదాంత పరిభాషలో చెప్పాలంటే విధి లీల అనొచ్చు. అలాంటిదే ఈ మహిళ జీవితంలో జరిగింది.

Written By:
  • NARESH
  • , Updated On : November 18, 2024 / 10:20 PM IST
    Follow us on

    ఆమెది ఓ మధ్య తరగతి జీవితం. ఆడంబరాలకు, హంగులకు దూరంగా ఉండేది. అయితే అనుకోకుండా లాటరీ తగలడంతో 20 కోట్లు లభించాయి. దీంతో ఆమెలో ఆనందం తాండవం చేసింది. సంబరం అంబరాన్ని తాకింది. అంతేకాదు విలాసవంతమైన జీవితం అలవాటయింది. అయితే అలాంటి మహిళ నేడు ఇబ్బందులు పడుతోంది. అంతేకాదు అత్యంత సాధన జీవితం గడుపుతోంది. ఆ మహిళ పేరు లారా.. ఆమె వెస్ట్ యార్క్ షైర్ లో నివాస ఉంటున్నది.

    అది 2005 సంవత్సరం. ఆమె పేరు లారా. వయసు 30 సంవత్సరాలు. భర్త పేరు రాజర్. రాజర్ ఐటీ మేనేజర్ గా పనిచేసేవాడు. లారా పసుపులో టీచరుగా పనిచేసేది. మొదట్లో వారికి అంతగా డబ్బు ఉండకపోయేది. మిడిల్ క్లాస్ జీవితాన్ని కొనసాగించేవారు. ఉన్నది ఒకతే కూతురు కావడంతో జీవితం ఉన్నంతలో సరదాగా సాగిపోయేది. అయితే అలా సాగుతున్న వారి జీవితంలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. లారాకు 20 కోట్ల లాటరీ తగిలింది. దీంతో వారు వెంటనే తన ఉద్యోగాలకు రాజీనామా చేశారు. 4.8 కోట్లతో భారీ విలాసవంతమైన భవనం కొనుగోలు చేశారు. సుఖవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. విదేశీ పర్యటనలు చేశారు. వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. ఒక బ్యూటీ సెలూన్ ఏర్పాటు చేశారు.

    ఒక్కసారిగా బుగ్గి అయిపోయింది

    విలాసవంతమైన వారి జీవితంలో 2010 దారుణమైన విషాదాన్ని నింపింది.. అగ్ని ప్రమాదంలో వారి ఇల్లు కాలిపోయింది. చివరికి బూడిద మిగిలింది. ఇల్లు కూడా లేని స్థాయి వచ్చేసింది. నిలువ నీడ లేకపోవడంతో ఉన్న బ్యూటీ సెలూన్ ను విక్రయించారు. వచ్చిన డబ్బుతో కొద్దిరోజుల పాటు హోటల్ లో తల దాచుకున్నారు. ఆ తర్వాత బంధువుల ఇళ్లల్లో ఉన్నారు. చివరికి ఒక ఇల్లు నిర్మించుకున్నారు. అయితే ఈ అవాంతరాలలో భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడ్డాయి. అవి కాస్త దూరానికి దారితీసాయి. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఏర్పడింది. దీంతో 2013లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఉన్న ఒక్క కూతురు లారాతోనే ఉండిపోయింది. భర్తతో విడిపోవడం లారాకు నరకం లాగా అనిపించింది. చివరికి కూతురు కోసం ఆమె పోరాటం చేయడం నేర్చుకుంది.. కష్టమైనా తప్పుదనుకొని చిన్న ఉద్యోగంలో చేరింది. కూతుర్ని పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు ఆ కూతురి వయసు 20 సంవత్సరాలు. ” జీవితం మనకు అన్నీ ఇస్తుంది. అన్నింటినీ ఒకే విధంగా చూడాలి.. అప్పుడే మనకు దాని పరమార్ధం అర్థమవుతుంది. అలాకాకుండా డబ్బు ఉన్నప్పుడు ఒక విధంగా.. లేనప్పుడు ఒక విధంగా ప్రవర్తిస్తే.. ఆ తదుపరి ఎదురయ్యే గుణపాఠాలు తీవ్రంగా ఉంటాయి. అవి నేర్పే అనుభవాలు కఠినంగా ఉంటాయి. ఎలాంటివి కావాలో ఎంచుకోవడం మన నడవడికను బట్టే ఆధారపడి ఉంటుందని” లారా చెబుతోంది.