https://oktelugu.com/

Sachin Tendulkar : షోయబ్ అక్తర్ బౌలింగ్లో పక్కటెముకలు విరిగిపోయాయి.. అంతటి బాధనూ సచిన్ బయటకు చెప్పలేదు: వీడియో వైరల్

టీమిండియా క్రికెట్ ను సచిన్ ముందు, సచిన్ తర్వాత అన్నట్టుగా విడదీయొచ్చు. ఆధునిక క్రికెట్ లో ఆడిన అనుభవం.. అంతకుముందు కాలంనాటి నైపుణ్యం సచిన్ సొంతం. అందువల్లే ఆయన నేటికీ క్రికెట్ గాడ్ గా కొనసాగుతున్నాడు. అద్భుతమైన రికార్డులతో క్రికెట్ రారాజుగా వెలుగొందుతున్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : November 18, 2024 / 10:28 PM IST

    sachin

    Follow us on

    వన్డేలు, టెస్టులలో సచిన్ నెలకొల్పిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. దేశవాళి క్రికెట్లోనూ సచిన్ సంచనాలను సృష్టించాడు. టీమిండియా కు అద్భుతమైన విజయాలను అందించాడు. అందువల్లే సచిన్ టెండూల్కర్ ను క్రికెట్ గాడ్ గా కొనియాడుతారు. బ్యాటింగ్లో ప్రయోగాలు చేసి.. ఫీల్డింగ్లో ప్రమాణాలు నెలకొల్పి.. బౌలింగ్లో వైవిధ్యాన్ని ప్రదర్శించి.. ఇలా క్రికెట్లో సమున్నతంగా వెలుగొందిన ఆటగాడిగా సచిన్ నిలిచిపోయాడు. అందువల్లే అతడు సాధించిన రికార్డులను బ్రేక్ చేయడం మరే ఆటగాడికి సాధ్యం కావడం లేదు. అతడు క్రికెట్ కు గుడ్ బై చెప్పి దశాబ్దం దాటిపోయినప్పటికీ.. ఇతర ఆటగాళ్లు దరిదాపుల్లోకి వచ్చారు గాని.. ఆ రికార్డులను బద్దలు కొట్టలేకపోయారు. మరోవైపు సచిన్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ప్రపంచ విహారిగా మారిపోయారు. తన శ్రీమతితో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను చుట్టివస్తున్నారు. దానికి సంబంధించిన విశేషాలను సామాజిక మాధ్యమాలలో పంచుకుంటున్నారు. తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు. ఐదు పదుల వయసు లోకి వచ్చినప్పటికీ.. సచిన్ నేటికీ అదే గ్లామర్ కొనసాగిస్తున్నారు.

    తెలియని కోణం

    సచిన్ టెండూల్కర్ జీవితం తెరిచిన పుస్తకమే అయినప్పటికీ.. ఆయన జీవితంలో ముఖ్యంగా క్రీడా జీవితంలో అభిమానులకు తెలియని ఓ విషయాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో గంగూలీ ఈ విషయాన్ని చెప్పారు.” పాక్ జట్టుతో మేము తలపడుతున్నాం. స్ట్రైకర్ గా సచిన్ ఉన్నాడు. షోయబ్ బౌలింగ్ వేస్తున్నాడు. అప్పటికి ఓ బంతి సచిన్ పక్కటెముకలను బలంగా తాకింది. ఆ దృశ్యాన్ని కళ్లారా చూసాను. వెంటనే సచిన్ వద్దకు వెళ్లాను . అంతా ఓకే కదా అని అడిగాను. దానికి సచిన్ సరే అని తల ఊపాడు. మ్యాచ్ చివరి వరకు క్రీజ్ లో ఉన్నాడు. ధాటిగా బ్యాటింగ్ చేసి జట్టును గెలిపించాడు. అయితే మరుసటి రోజు నేను సచిన్ ను చూడగా.. అతని పక్కటెముకలకు రెండు ఫ్రాక్చర్లు అయ్యాయి. ఆ తర్వాత అతడు నాకు మరో విధంగా కనిపించాడు. అందుకే సచిన్ అంటే నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. అతడు అంటే ప్రత్యేక గౌరవం ఉంటుంది. అతడు ఆటకు వన్నెతెచ్చిన ఆటగాడు. క్రికెట్ స్థాయిని పెంచిన ఆటగాడు. క్రికెట్లో అరుదైన రికార్డులు సృష్టించిన ఆటగాడు. అందువల్లే సచిన్ లేకుండా క్రికెట్ ప్రస్తావన తీసుకురావడం సాధ్యం కాదు. ఆటపై అద్భుతమైన ముద్ర వేసిన ప్లేయర్ అతడు. అందువల్లే అతని ఇప్పుడే కాదు మరిప్పుడు కూడా క్రికెట్ గాడ్ అని సంబోధిస్తుంటాం. ఇలా అనడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదని” గంగూలీ వ్యాఖ్యానించాడు. అయితే గంగూలీ నాయకత్వంలో సచిన్ ఎన్నో మ్యాచులలో టీమిండియను గెలిపించాడు. గంగూలీతో కలిసి సుదీర్ఘమైన ఇన్నింగ్స్ లు ఆడాడు.