
Food is God : అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఎందుకంటే అన్నాన్ని కడుపులోకి తీసుకుంటాం. ఆకలితో ఎంతో మంది తహతహలాడుతుంటారు. మనకు దొరికిన అన్నం దేవుడితో సమానంగా భావిస్తాం. మనం జన్మించేనాటికే మనకు ఎంత అన్నం తినాలనే దానిపై భగవంతుడు నిర్ణయిస్తాడట. అందులో భాగంగానే మన అలవాట్టు ఉంటాయి. దీంతో మనకు మన జీవితంలో లభించే అన్నంతో మన జీవితం గడుస్తుంది.
మనకు నూకలు చెల్లాయంటే..
మనకు అన్నం బాకి ఉన్నంత కాలం మనం జీవించి ఉంటాం. మనకు భూమి మీద నూకలు చెల్లాయంటే మనకు పై లోకానికి పిలుపు వచ్చినట్లే. అందుకే వాడికి నూకలు చెల్లిపోయాయని చెబుతారు. ఇలా మనం తినే ఆహారం మనకు ఎంత మేర తీసుకుంటామో అంతవరకే మన బతుకు ఉంటుంది. ఈ నేపథ్యంలో అన్నంను పారేయడం చేయకూడదు. ఎవరికైనా దానం చేస్తే పుణ్యం వస్తుంది.

ఎవరికి పుట్టాలో..
మనకు తల్లిదండ్రులు ఎవరనేది కూడా భగవంతుడు నిర్ణయిస్తాడట. అందుకే మనం ఫలానా వారి కడుపులో పుట్టాలని అనుకుంటే కుదరదు. దానికి భగవంతుడి చూపు ఉంటేనే సాధ్యమవుతుంది. మనం దరిద్రుడి కడుపులో పుట్టాలా? లేక ధనవంతుడి కడుపులో పుట్టాలనేది దేవుడే నిర్ణయిస్తాడు. ఇలా మన పుట్టుకలో కూడా ఇంత రహస్యం దాగి ఉంటుందట. దరిద్రుడి కడుపులో పుడితే ఆకలి వేస్తుంది. ధనవంతుడి కడుపులో పుడితే డబ్బు ఉంటుంది.
ఆకలితో ఉన్నవాడికి..
ఆకలితో ఉన్న వాడికి పట్టెడన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటారు. అన్నం పెట్టిన వాడు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తుంటారు. మనిషికి ఏది ఇచ్చినా సరిపోలేదు అంటాడు. కానీ అన్నం పెడితే మాత్రం ఇక చాలు అనే సమాధానం వస్తుంది. ఇలా మనిషికి అన్నం తినడం వల్ల శక్తి లభిస్తుంది. దీంతో బతుకుతాడు. అన్నం లేకపోతే ఆకలికి తట్టుకోలేక చనిపోయిన వారు కూడా ఉంటారు.