Gold Prices: భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు..ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. నవంబర్ 17న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,550గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.61,690 గా ఉంది. నవంబర్ 17న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.55,590తో విక్రయించారు.

Written By: Chai Muchhata, Updated On : November 18, 2023 8:24 am

Gold Prices

Follow us on

Gold Prices: ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కొనగలమా? అని డైలామాలో పడుతున్నారు వినియోగదారులు. ఎందుకంటే రోజురోజుకు బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62 వేలకు చేరువైంది. వెండి ఏకంగా రూ.1500 పెరిగింది. 2023 నవంబర్ 18న శనివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బులియన్ మార్కెట్ ప్రకారం.. నవంబర్ 17న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,550గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.61,690 గా ఉంది. నవంబర్ 17న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.55,590తో విక్రయించారు. శుక్రవారం కంటే శనివారం బంగారం ధరలు రూ.600 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,700 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.61,840గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.55,550 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.61,690 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,000 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,180తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.56,550 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.61,690తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.56,550తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.61,690తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలతో పాటు వెండి ధరలు స్పల్పంగా పెరిగాయి. శనివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.76,500గా నమోదైంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం వెండి ధరలు రూ.1500 మేర పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.76,500గా ఉంది. ముంబైలో రూ.76,500, చెన్నైలో రూ.79,500, బెంగుళూరులో 75,500, హైదరాబాద్ లో రూ.79,500తో విక్రయిస్తున్నారు.