
CNG Cars: ఒకప్పుడు డీజిల్ కార్లను ఎక్కువగా వినియోగించిన వారు ఆ తరువాత పెట్రోల్ వెహికిల్స్ పై మనసు పారేసుకున్నారు. కాలక్రమంలో ఇప్పుడు ఎలక్ట్రిక్, సీఎన్ జీ కార్ల కొనుగోలుపై వినియోగదారులు ఇంట్రెస్ట్ పెడుతున్నారు. అయితే మొన్నటి వరకు మార్కెట్లోకి వీటి ఉత్పత్తి తక్కువగా రావడంతో ధరలు ఎక్కువగానే ఉన్నాయి. రాను రాను వీటి డిమాండ్ పెరుగుతుండడంతో కొన్ని కంపెనీలో వీటిని అత్యున్నత మోడల్ లో తయారు చేస్తున్నారు. అంతేకాకుండా అందరికీ అందుబాటులో ఉండేవిధంగా తక్కువ ధరలతో మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఇవి ధర తక్కువగా ఉండడంతో పాటు మైలేజీని ఎక్కువ ఇస్తాయి. మరి అలాంటి కార్లేవో తెలుసుకుందామా..
టాటా టియాగో ఐసీఎన్ జీ:
దేశీయంగా అత్యధికంగా కార్లను విక్రయించే కంపెనీల్లో టాటా ఒకటి. ఈ సంస్థ నుంచి CNG కార్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో టాటా టియాగో ఐసీఎన్ జీ కేజీ పవర్ కు 26.49 కిలోమీటర్ల మైలేజి ఇస్తుంది. ఇందులో 1.2 లీటర్ ఇంజిన్ 72 bhp పవర్, 95 NM టార్క్ జనరేట్ చేస్తుంది.

మారుతి వ్యాగన్ ఆర్ CNG:
ఉత్తమ మైలేజ్ అందించే మారుతి సుజుకి వ్యాగర్ ఆర్ ధర రూ.6.43 లక్షలు. ఇది ఒక సీఎఉన్ జీతో 34.05 కిలీమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో 1.0 లీటర్ కే సిరీస్ ఇంజిన్ 56 bhp పవర్, 82 NM టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

మారుతి సుజుకి Alto K 10 CNG:
మారుతి నుంచి రిలీజైన ఆల్టో కె 10 ఇప్పటికే వినియోగదారులను ఆకట్టుకుంది. ఇక ఈ మోడల్ నుంచి వచ్చిన Alto K 10 CNG కేజీకి 34 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇందులో 1.0 లీటర్ K 10 సీరీస్ ఇంజిన్ 56 bhp పవర్, 82 NM టార్క్ ను అందిస్తుంది.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో:
మారుతి నుంచి వచ్చిన CNG మోడళ్లలో దీనిని ది బెస్ట్ గా పేర్కొంటారు. ఇది కేజీకి 32 కిలో మీటర్ల మైలేజి ఇస్తుంది. దీనిని రూ.6 లక్షలకు విక్రయిస్తున్నారు. ఇందులో 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 56 bhp పవర్, 82 NM టార్క్ ను అందిస్తుంది.

మారుతి సుజుకి ఆల్టో 800:
మార్కెట్లలో అత్యంత తక్కువ ధర కలిగిన కారు మారుతి సుజుకి ఆల్టో 800 సీఎన్ జీ. ఇది కేజీకి 30 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని ధర రూ.5.23 లక్షలు.

సీఎన్ జీ కార్లను వినియోగించేవారికి ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు. ఇటీవల సీఎన్ జీ కార్ల ధరను బాగా తగ్గించారు.