Dog: ఈ భూమ్మీద జీవించే హక్కు మనుషులతో పాటు ప్రతి జీవికి ఉంది. కానీ మనుషులకు మెదడు ఉండడం వల్ల బతకడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ మూగజీవాలు మాత్రం ఆహారం తప్ప ఇతర సౌకర్యాలు పొందలేవు. అందువల్ల అవి ఎప్పటికీ మనుషుల చేతిలోనే ఉండిపోతాయి. అయితే అందరూ మనుషులు ఒకే రకంగాం ఉంటామని చెప్పలేం. కొందరు మానవత్వంతో కూడుకొని ఉంటారు. మరికొందరు మాత్రం కర్కోటక మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. భారతదేశ రాజధీని ఢిల్లీలో ఓ వ్యక్తి అలాగే ఓ మూగజీవిపై కఠినంగా ప్రవర్తించాడు. కానీ పాపం ఆ మూగజీవికి తెలియదు.. తనను తన యజమాని మోసం చేశాడని.. అయితే ఆ యజమాని వస్తాడని ఆశతో ఎదురుచూస్త కూర్చుంది. ఈ దృశ్యాన్ని చూసిన కొందరు జంతు ప్రేమికులు ఏం చేశారంటే?
జంతువుల్లో కుక్కులు ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. దీంతో చాలా మంది తమ కుటుంబ సభ్యుల్లాగే కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. కుక్కులు సైతం తమను పోషించే యజమాని కోసం ఏం చేయడానికైనా వెనుకాడవు. కానీ ఓ యజమాని మాత్రం మనసు లేని వ్యక్తిగా ప్రవర్తించాడు. ఢిల్లీలోని ఓ రద్దీ మార్కెట్లో జర్మనీ షెపర్డ్ జాతికి చెందిన ఓ కుక్క కూర్చొని ఉంది. అది తన యజమాని వస్తాడని ఎదురుచూస్తూ ఉండిపోయింది. తన దీనావస్థను చూసిన అజయ్ జో అనే వ్యక్తి మనసు కరిగింది. దీంతో ఆ విషయాన్ని అందరికీ చెప్పాలని అనుకున్నాడు. వెంటనే కుక్క పడే బాధను వీడిో తీసి సోషల్ మీడియాలో ఉంచాడు. జనవరి 14న పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ అయింది.
ఇదే సమయంలో ఓ జంతు ప్రేమికురాలు కుక్కకు ఆహారాన్ని అందించింది. దాని రక్షణ చర్యలు చూసుకుంది. రేణు అనే మరో వ్యక్తి ఆ కుక్కను తరలించేందుకు అంబులెన్స్ ను పిలిపించాడు. అయితే ఈ కుక్కను సోఫీ మెమోరియల్ యానిమల్ రిలీఫ్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు కావేరి రాణా సంరక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఆడ కుక్క కాదని అన్నారు. అంతకుముందు వలంటీర్లు నిరంతరం ఆ కుక్క సంరక్షణ కోసం ఎంతో శ్రమించారు. ఈ విషయాన్ని అజయ్ జో మరో పోస్టు పెట్టాడు.
అయితే ప్రముఖ ఫుడ్ సంస్థ స్విగ్గీ ఆధ్వర్యంలో కుక్క యజమాని అడ్రస్ ను తెలుసుకొని దానిని తన యజమానికి వద్దకు చేర్చింది. గతం నుంచి స్విగ్గి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మొత్తంగా కుక్కను యజమాని వద్దకు చేర్చడంలో సక్సెస్ అయినందుకు దానికి ‘స్విగ్గి’ అని పేరు పెట్టారు. దీంతో జంతు ప్రేమికులు ఊపరి పీల్చుకున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. కుక్కపై కరుణ లేని యజమానిని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ‘నోరు లేని జంతువును అలా నడి రోడ్డుపై విడిచిపెట్టడం క్రూరమైన చర్య ’అని అన్నారు. అలాగే ఈ పని చేసిన కుక్క యజమానికి శాపం తగలాలి అంటూ ధూషించారు.