Numeros: ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా పెరిగిపోతుండడంతో చాలామంది వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే సమయంలో పలు కంపెనీలు సైతం EVలను మాత్రమే లాంచ్ చేస్తున్నాయి. ఇప్పటికే TVS లాంటి టూవీలర్ కంపెనీలు రకరకాల ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి . తాజాగా Numeros అనే కంపెనీ కొత్త స్కూటర్ ను పరిచయం చేసింది. ఇది మిగతా స్కూటర్ల కంటే భిన్నంగా ఉండడంతో పాటు ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉండడంతో చాలామంది దీని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇందులో ఉండే ఫీచర్లుచ ఇంజన్ మిగతా స్కూటర్ల మాదిరిగానే ఉన్నాయా..? లేక వేరేలా ఉన్నాయా..? అనే విషయాలను పరిశీలిద్దాం..
నూమెరోస్ కంపెనీ బెంగళూరు కేంద్రంగా ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ కంపెనీ తాజాగా ఢిల్లీలో జరుగుతున్న ఆటోమొబిలిటీ షో 2025లో తన కొత్త స్కూటర్ ను ప్రదర్శించింది. Diplos Mark అనే ఈ స్కూటర్ బడ్జెట్ ధరలోనే వినియోగదారులకు అందించాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లు లక్షకుపై గానే ధరలు ఉన్నాయి. కొన్ని స్కూటర్లు 1,50,000 కు మించి ఉన్నాయి. కానీ దీనిని రూ. 1,.09,999 కి అందించాలని నిర్ణయించారు. కొత్తగా స్కూటర్ కొనాలని అనుకునే వారితో పాటు సిటీలో తమ అవసరాలు తీర్చుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది.
ఈ స్కూటర్ ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగి ఉంది. చూడగానే దానిపై డ్రైవ్ చేయాలనిపించే విడిభాగాలు ఉన్నాయి. ఇది ఎల్ఈడీ డిఆర్ఎల్ ఓవల్ ఎల్ఈడి బ్రేక్ లైటింగ్ తో పాటు రౌండ్ హెడ్ లైట్ టర్న్ సిగ్నల్స్ ఉన్నాయి. వీటితోపాటు బాడీ ప్లానెళ్లు మరింత దృఢంగా అనిపిస్తాయి. సీటింగు ఇద్దరు విశాలంగా కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. లాంగ్ డ్రైవ్ కూడా దీనిపై వెళ్లేలా తయారు చేశారు. వీటితోపాటు మిగతా ఫీచర్లు కూడా డ్రైవర్లకు అనుకూలంగా సెట్ చేశారు.
నూమెరోస్ డిప్లోస్ మార్క్స్ స్కూటర్ ఇంజన్ విషయానికి వస్తే.. ఇందులో 3.7 kWh బ్యాటరీని అమర్చారు. ఇందులో డ్యూయల్ ప్యాక్ ఆప్షన్ ను కూడా ఉంచారు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 140 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ ఇంజన్ 3.58 bhp హార్స్ పవర్ తో పాటు 138 NM గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. గరిష్టంగా తీసుకోటం 63 కిలోమీటర్ల speed వరకు వెళ్తుంది.ఈ ఇంజన్ ఫుల్ చార్జ్ కావడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.
ఈ స్కూటర్ బరువు 137 కిలోలు. చాలా లైట్ వెయిట్ తో ఉన్న ఇది మహిళలకు సైతం సౌకర్యంగా ఉంటుంది. అయితే దీని డిఫరెంట్ డిజైన్ చూసి ఎక్కువమంది పురుషులే కొనుగోలు చేస్తారని అంటున్నారు. ఇందులో యూఎస్బీ చార్జింగ్ పోర్టుతో పాటు 1.2 కిలోవాట్ చార్జర్ ను ఉంచారు. వాహనదారులకు సేఫ్టీ కోసం డిస్క్ బ్రేక్లను అమర్చారు. అలాగే ఇందులో 12 అంగుళాల చక్రాలు ట్యూబ్ లెస్ టైర్లు ఉన్నాయి.