Marwari business mindset: తెలంగాణలో మార్వాడీల గో బ్యాక్ అనే వివాదం తలెత్తింది. కొందరు తమ వ్యాపారాలకు మార్వాడీలు నష్టం చేకూరుస్తున్నారని ఆందోళన చేశారు. అయితే మార్వాడీలు ఎక్కువ శాతం వ్యాపారం మాత్రమే చేస్తుంటారు. మీరు ఎక్కడ కార్యాలయాల్లో కనిపించరు. అంతేకాకుండా మీరు ఎక్కువగా చదువుకోరు కూడా. కానీ మార్వాడీలు తక్కువ కాలంలోనే ఎంతో డబ్బు సంపాదిస్తారు. వాళ్లు ఇలా తక్కువ కాలంలోనే డబ్బు సంపాదించడానికి కారణమేంటి? మార్వాడిన దగ్గర ఉన్న ట్రిక్ ఏంటి? ఎలా వీరు ధనవంతులుగా మారుతారు?
కొందరికి ఉద్యోగం చేయడం ఇష్టం.. ఎందుకంటే ఒక్కో రోజు పని చేసినా.. చేయకపోయినా.. నెలకు జీతం వస్తుంది. హాయిగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండొచ్చు. కంపెనీ లేదా సంస్థకు లాభం వచ్చినా.. రాకపోయినా.. డబ్బులు వస్తాయి. కానీ మార్వాడీలు మాత్రం దీనిని అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే వీరు డబ్బు విషయంలో పకడ్బందీగా ఉంటారు. చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ టాపు సంపాదించాలని టార్గెట్ టార్గెట్ ఏర్పాటు చేసుకుంటారు. ఈ టార్గెట్ ను రీచ్ కావడానికి పగలు రాత్రి కష్టపడుతూ ఉంటారు. మరి ఆ టార్గెట్స్ ఏంటంటే?
ఇల్లు కట్టుకోవడానికి ఒక కోటి రూపాయలు కావాలి.. పిల్లల చదువులకు రెండు కోట్లు కావాలి.. వారి పెళ్లిళ్లకు మరో రెండు కోట్లు సంపాదించాలని అనుకుంటారు. వీటితో పాటు నెలనెలా ఖర్చులకోసం మరో 50,000 కావాలి. మరి ఈ 50 వేల కోసం వారు ఒక కోటి రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని అనుకుంటారు. అంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ కోసం ఇంకో కోటి కావాలి. ఇలా మొత్తం ఐదు కోట్ల టార్గెట్ ను ఏర్పాటు చేసుకుంటారు. అంటే ప్రతి ఒక్కరు ఇంత మొత్తంలో కాకుండా వారి స్థాయిలో ఒక టార్గెట్ ను ఏర్పాటు చేసుకొని ఆ మొత్తంలో సంపాదించాలని నిర్ణయించుకుంటారు.
ఇక ఈ టార్గెట్ ను రీచ్ కావడానికి వారు ఏ పనైనా చేయగలుగుతారు. బస్టాండ్లో popcorn నుంచి.. ఫ్యాక్టరీ వరకు.. సొంతంగా మాత్రమే చేయాలని అనుకుంటాడు. ఎందుకంటే ఉద్యోగం చేసేవారు టార్గెట్ ను రీచ్ చేయలేరు. సొంతంగా వ్యాపారం చేసేవారు మాత్రమే అనుకున్న స్థాయికి వెళ్ళగలుగుతాడు. ఇందుకోసం పగలు, రాత్రి అని తేడా లేకుండా నిత్యం కష్టపడుతూ ఉంటారు. అనుకున్న డబ్బు సంపాదించే వరకు ఇతర ఖర్చులకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా వారు రియల్ ఎస్టేట్ విషయంలో అస్సలు పెట్టుబడులు పెట్టరు. స్టాక్ మార్కెట్ లేదా ఒక షాపు ఉంటే మరో షాపు ఏర్పాటు చేసుకుంటారు. అందుకే చాలామంది మార్వాడీలు ఇతర ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు ఇల్లు కట్టుకోవడం లేదా నిర్మించుకోవడం అనేది చేయరు. వారి ఉద్దేశం ప్రకారం ఇల్లుపై పెట్టే పెట్టుబడి.. ఇతర వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఎక్కువగా లాభం వస్తుందని భావిస్తారు. అందుకే మార్వాడీలు మిగతా వారి కంటే తొందరగా అభివృద్ధి చెందుతారు. ముఖ్యంగా వారు చేసే వ్యాపారం చిన్నదా? పెద్దదా? అని ఆలోచించరు. నచ్చిన వ్యాపారం చేసుకుంటూ పోతారు.