Pawan Kalyan serial direction: నేడు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి ఎవరికీ తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు అభిమానులు. అందరికి తెలిసిన విషయం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ హీరో అవుదామని ఇండస్ట్రీ లోకి రాలేదు. దర్శకుడు అవుదామనే వచ్చాడు. డైరక్షన్ డిపార్ట్మెంట్ లో ఆయన కోచింగ్ కూడా తీసుకున్నాడు. కానీ వదిన సురేఖ ఇంత అందంగా ఉండే అబ్బాయి డైరెక్టర్ గా కంటే హీరో గానే ఎక్కువ సక్సెస్ అవుతాడని చెప్పడం తో చిరంజీవి ప్రోత్సహంతో పవన్ కళ్యాణ్ ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసాడు. ఇక ఆ తర్వాత ఆయన సినీ కెరీర్ ఎలా సాగిందో మన అందరికీ తెలిసిందే. అయితే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో డైరక్షన్ కోచింగ్ తీసుకున్న తర్వాత ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది.
అప్పట్లో దూరదర్శన్ లో ఒక సరికొత్త సీరియల్ చేయడానికి కొత్త టాలెంట్ కోసం వెతుకుతున్నారు. ఒక ఆడిషన్స్ లాంటివి నిర్వహించి ఒక టీవీ సీరియల్ తీయడం కోసం పైలట్ ఎపిసోడ్ లాగా షూటింగ్ చేసి తమకు పంపాల్సిందిగా అప్పట్లో ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన చూసిన తర్వాత దర్శకత్వం పై మక్కువ ఉన్న ఎంతో మంది కుర్రాళ్ళు పైలట్ ఎపిసోడ్స్ ని చిత్రీకరించి దూరదర్శన్ ఛానల్ కి పంపించారు. అలా పంపిన వారిలో పవన్ కళ్యాణ్ కూడా ఒకడు అట. ఆయన దర్శకత్వం లో వచ్చిన ఆ పైలట్ ఎపిసోడ్ దూరదర్శన్ యాజమాన్యం కి బాగా నచ్చింది, నడుపరి ఇంటర్వ్యూస్ కోసం పవన్ కళ్యాణ్ ని పిలిచారట కూడా. కానీ అంతలోపు ఆయన మొదటి సినిమాలో నటించడానికి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేసాడు. దీంతో కేవలం ఆ సీరియల్ కి సంబంధించిన పైలట్ ఎపిసోడ్ తోనే సరిపెట్ట్టుకోవాల్సి వచ్చింది. అలా పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో సీరియల్ కోసం దర్శకత్వం వహించిన ఏకైక సందర్భంగా దీనిని పరిగణించవచ్చు.
సినిమాల్లోకి రాకముందు ఆయన వివిధ మార్గాల్లో ప్రయాణం చేసి పైకి వచ్చేందుకు చాలా ప్రయత్నాలే చేసాడు. ముందుగా ప్రింటింగ్ ప్రెస్ లో ఉద్యోగం తో తన కెరీర్ ని మొదలు పెట్టాడు. ఆ తర్వాత గో డౌన్ లో గుమస్తాగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ చిరంజీవి తమ్ముడు అని చెప్పుకోకుండా ఆయన తన కాళ్ళ మీద తాను నిలబడడానికి చేసిన ప్రయత్నాలు. ఇక ఆ తర్వాత ఆయనకు ఒక నర్సరీ ని నడపాలనే ఆలోచన కూడా అప్పట్లో ఉండేది. చిరంజీవి పవన్ కళ్యాణ్ ఎంచుకుంటున్న దారులు చూసి భయపడి వీడిని కూడా ఫిలిం ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేసి సినిమాల్లోకి తీసుకొని రావాలని అనుకున్నాడు. అలా మొదలైన ప్రస్థానమే పవర్ స్టార్ సినీ ప్రస్థానం.