Causes of heavy rain: ఈ సంవత్సరం వర్షాలు అధికంగా కురిసినట్లే అని అనుకోవచ్చు. వెదర్ రిపోర్ట్ ప్రకారం ఇప్పటికే 75% వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత సంవత్సరం కూడా భారీ వర్షాలు కురిసాయి. కానీ 1999 నుంచి 2003 వరకు తక్కువ వర్షపాతం నమోదయింది. వరుసగా కొన్నేళ్లపాటు వర్షాలు లేక కరువు ఏర్పడింది. ఆ తర్వాత 2004 నుంచి వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. మరి ఇలా కొన్ని సంవత్సరాల పాటు డ్రై గా ఉండి.. మరికొన్ని ఏళ్లపాటు వర్షాలు కురవడానికి కారణం ఏంటి? అసలు ఇలా ఎందుకు జరుగుతుంది?
వర్షాలు కురవడానికి El nino, Lanino ప్రభావాలు తీవ్రంగా ఉంటాయి. ఎల్నినో ప్రభావం ఉంటే తక్కువ వర్షపాతం ఉంటుంది..Lanino ఎఫెక్ట్తో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. Elnino అనేది పసిఫిక్ మహాసముద్రం లోని ఈశాన్య భాగంలో సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరుగుతుంటాయి. దీంతో ఈ ప్రభావం ప్రపంచ వాతావరణంపై ఉంటుంది. ముఖ్యంగా భారత్లో, ఇతర ఆసియా దేశాల్లో ఉష్ణోగ్రత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా వర్షపాతం తక్కువగా ఉండి కరువు ఏర్పడుతుంది. ఈ ప్రభావంతో 2 నుంచి7 సంవత్సరాల పాటు వర్షాలు కురవకుండా ఉంటాయి. దీంతో కరువు ఏర్పడి.. ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది.
Lanino అనేది ఉష్ణోగ్రత తగ్గడం వల్ల ఈ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతుంది. ముఖ్యంగా ఆసియా దేశాలపై ఇది ఉండడంతో ఇక్కడ వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా వర్షాలు విజృంభిస్తున్నాయి. అటు చైనా దేశంలోనూ జోరు వర్షాలు కురుస్తున్నాయి. దీనికి Lanino ప్రభావం అని అనుకోవచ్చు. దీని ప్రభావంతో రిజర్వాయర్లు, చెరువులు నిండిపోతాయి. Lanino ప్రభావంతో మూడు నుంచి ఐదు సంవత్సరాలపాటు వర్షాలు కురుస్తాయి ఇవి వరుసగా ఉండే అవకాశం ఉంటుంది.
ఇలా వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదవుతుంది. కొన్నిచోట్ల క్లౌడ్ బర్నింగ్ ప్రభావం కూడా ఉంటుంది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బర్నింగ్ కారణంగా ఒక్కసారిగా వరదలు విజృంభించాయి. దీంతో ఇల్లు కొట్టుకుపోయాయి. చాలామంది గల్లంతు అయ్యారు. అయితే వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ముందే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ హెచ్చరికల ప్రకారంగా లోతట్టు లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా పట్టణాలు, నగరాల్లో వర్షం అధికంగా ఉంటే అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకుండా ఉండడమే మంచిది. హైదరాబాద్ లాంటి నగరంలో వర్షం సమయంలో బయటకు వెళ్లడం ద్వారా ట్రాఫిక్ లో ఇరుక్కుని ప్రమాదం ఉంది. అంతేకాకుండా కొన్నిచోట్ల తెలియకుండానే గుంతలు ఉండడంతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.