
KL Rahul: నాగపూర్ లో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించింది. ఇక్కడ కెప్టెన్ రోహిత్ శర్మ సాధించిన సెంచరీ ప్రత్యేకమైనది. బ్యాటింగ్ కు అనుకూలంగా లేని పిచ్ పై సెంచరీ సాధించడం మామూలు విషయం కాదు. సహజ శైలికి భిన్నంగా ఆడిన రోహిత్ ఆటతీరు అందరు ప్రశంసిస్తున్నారు. రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ ఇండియాకు ఎంతో విలువైనది. రోహిత్ బ్యాటింగ్ జోరు మనకు తెలుసు. అతడు చేసిన సెంచరీల్లో మూడే ముఖ్యమైనవి. చెపాక్ స్టేడియంలో 161రుగులు, ఓవల్ మైదానంలో చేసింది నాగపూర్ లో చేసిన సెంచరీలు ప్రధానమైనవే. ఆసీస్ పై చేసిన సెంచరీతో రోహిత్ స్టామినా తెలిసింది.
ఇక మ్యాచ్ లో రోహిత్ ఈ సెంచరీ చేయడానికి చాలా కష్టపడ్డాడు. నెట్స్ లో ప్రాక్టీసు చేసి ఆసీస్ పై ఆధిపత్యం చాటాడు. ఫలితాంగా వారిని దెబ్బ కొట్టాడు. తొలి టెస్టులో విజయం సాధించేందుకు దోహదం చేశాడు. అక్షర్ పటేల్ బౌలర్లయినా తన బ్యాట్ తో ఆసీస్ ను ముప్ప తిప్పలు పెట్టాడు. అతడు కూడా మంచి బ్యాటింగ్ చేసి శభాష్ అనిపించుకున్నాడు. కానీ అతడు బౌలింగ్ చేయాల్సినా బ్యాటింగ్ లో తన సత్తా చాటి మరోమారు బ్యాటర్ కొరత తీర్చాడు. బ్యాటింగ్ లో అతడి ప్రదర్శన బాగుంది.

వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ విషయానికి వస్తే అతడు ఆడిన పది టెస్టుల్లో రెండే సెంచరీలు చేశాడు. అందులో ఒకటి ఇంగ్లండ్, మరొకటి దక్షిణాఫ్రికాలో సాధించాడు. విరాట్, రోహిత్ లా ప్రతిభ ఉన్న బ్యాటరే కానీ ఇటీవల ఫామ్ కొనసాగించలేకపోతున్నాడు. అతడి టాలెంట్ త్వరలో వెలుగులోకి వస్తుంది. అప్పుడు అందరు అతడిని ప్రశంసిస్తారని చెబుతుంటారు. ఇలా టాలెంట్ ఉన్న ఆటగాడు కావడంతోనే అతడిని ప్రతి సారి సెలెక్ట్ చేస్తున్నారు. ఈ మేరకు కంగారూలతో జరిగే మ్యాచ్ లకు కూడా అతడిని తీసుకోవడానికి కారణాలు ఇవే.
తొలి టెస్టులో భారత్ విజయం సాధించడంతో ఇక రెండో టెస్టుపై దృష్టి సారించింది. రోహిత్ శర్మ 212 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సులతో రాణించాడు. అతడికి తోడుగా ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా 170 బంతుల్లో 9 ఫోర్లతో 66, అక్షర్ పటేల్ 102 బంతుల్లో 8 ఫోర్లతో 52 పరుగులు సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. మన వాళ్లు ఆడిన తరువాత ఆసీస్ బ్యాటింగ్ కు దిగినా సరైన రీతిలో ఆడలేకపోవడంతో ఓటమి పాలైంది. దీంతో టీమిండియా 1-0 ఆధిక్యం సంపాదించుకుంది.