Tenant Rights:సాధారణంగా ఇంటి యజమానులు ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తులను సంవత్సరాల పాటు ఉండనివ్వరు. అద్దెకు ఉండే వ్యక్తులు ఇంటిని ఆక్రమించుకుంటారనే భయం వెంటాడటం వల్ల ఇంటి యజమానులు ఈ విధంగా వ్యవహరిస్తారు. అయితే అద్దెకు ఉండే వ్యక్తికి నిజంగా ఇంటిపై హక్కు ఉంటుందా? అనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానాలు వెలుగులోకి వస్తున్నాయి. న్యాయ నిపుణులు అద్దెకు ఉన్న వ్యక్తి ఆస్తిని ఆక్రమించలేడని చెబుతున్నారు.
యజమాని యొక్క ఆస్తిపై అద్దెకు ఉండే వ్యక్తికి ఎటువంటి హక్కులు ఉండవు. అయితే 12 సంవత్సరాల కంటే ఎక్కువగా అద్దెకు ఉండే వ్యక్తులు ఒకే ఇంట్లో ఉంటే మాత్రం ఆస్తిపై హక్కును పొందే అవకాశం ఉంటుంది. యజమాని అద్దె ఒప్పందంలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉండటం వల్ల అద్దెకు ఉండే వ్యక్తులకు హక్కులు లభించకుండా చేయవచ్చు. ఇంటి యజమాని ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తుల నుంచి ప్రతి నెలా అద్దె వసూలు చేయాలి.
Also Read: Om Chant Benefits: ప్రతిరోజూ “ఓం” జపం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?
ఇలా చేయడం ద్వారా యజమాని యొక్క ఆస్తులను ఇతరులు స్వాధీనం చేసుకునే అవకాశం అయితే ఉండదని చెప్పవచ్చు. ఈ నిబంధనలను పాటించకుండా ఉంటే మాత్రం 11 సంవత్సరాలకు పైగా నివాసం ఉండే వ్యక్తులు అద్దె ఒప్పందంను ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి. 1963 సుప్రీం కోర్టు పరిమితి చట్టంను అనుసరించి ఏదైనా ప్రైవేట్ స్థిరాస్థిపై చట్టబద్ధమైన కాలపరిమితి 12 సంవత్సరాలుగా ఉంది.
ప్రభుత్వ స్థిరాస్థి విషయంలో మాత్రం చట్టబద్ధమైన కాలపరిమితి 30 సంవత్సరాలుగా ఉంది. ఇంటి యజమానులు, అద్దెకు ఉండే వ్యక్తులు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.