Homeఆంధ్రప్రదేశ్‌AP Politics: వారు మాజీలయ్యారు.. పత్యర్థులు అమాత్యులయ్యారు.. రివేంజ్ రాజకీయాలు స్టార్ట్

AP Politics: వారు మాజీలయ్యారు.. పత్యర్థులు అమాత్యులయ్యారు.. రివేంజ్ రాజకీయాలు స్టార్ట్

AP Politics:  వారు కాస్తా మాజీలయ్యారు. వారి ప్రత్యర్థులు అమాత్యులయ్యారు. ఇంకేముంది ఒకరికి ఒకరు కెలుక్కుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకూ.. చిత్తూరు నుంచి కడప వరకూ రాజకీయ ముఖచిత్రాలే మారిపోతున్నాయి. పేరుకే జిల్లాల విభజన కానీ.. ఉమ్మడి జిల్లాల రాజకీయ వైరుధ్యాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షంతో పాటు సొంత పార్టీలో నేతలను ఢీ అంటే ఢీ అంటున్నారు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాది ప్రత్యేక స్థానం. పేరుకే వెనుకబాటు అన్న అపవాదు కానీ.. రాజకీయంగా చైతన్యం కలిగిన జిల్లా. పార్టీ ఏదైనా, అధికార పక్షం, విపక్షం అన్న తేడా లేకుండా ఇక్కడి నాయకులు కీలక పదవులు సొంతం చేసుకుంటారు.

AP Politics
YCP

ప్రస్తుతం శాసనసభ స్పీకర్ గా తమ్మినేని సీతారాం, రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు, పశుసంవర్థక శాఖ మంత్రిగా డాక్టరు సీదిరి అప్పలరాజు ఉన్నారు. ఇందులో సీతారాం, అప్పలరాజు పాత కాపులే. కానీ ధర్మాన క్రిష్ణదాస్ ను తప్పించి కొత్తగా ఆయన సోదరుడు ప్రసాదరావుకు పదవి ఇచ్చారు. అంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇప్పుడు రివేంజ్ రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. గత మూడేళ్లుగా ధర్మాన ప్రసాదరావు ఎక్కడుండేవారో తెలియదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో వేదికలు పంచుకునే వారు కాదు. కీలక నేతలు జిల్లాకు వచ్చినా ముఖం చాటేసేవారు. సోదరుడు క్రిష్ణదాస్ తో కూడా సఖ్యత అంతంతమాత్రమే.

Also Read: Gautam Adani: అంబానీని దాటేసి.. ప్రపంచ ఆరో కుబేరుడిగా అదానీ

ఈ నేపథ్యంలో తమ్మినేని సీతారాం తన రాజ్యాంగబద్ధ పదవిని అడ్డం పెట్టుకొని ధర్మాన ప్రసాదరావును ఓ రేంజ్లో ఆడుకున్నారు. జిల్లా కేంద్రానికి ఎమ్మెల్యేగా ఉన్న ధర్మాన ప్రసాదరావు నియోజకవర్గంలో రివ్యూలు సైతం నిర్వహించేవారు. తాను స్పీకర్ నని ప్రభుత్వ పాలనకు సంబంధించి రివ్యూలు సైతం నిర్వహించుకోవచ్చని తేల్చిచెప్పేవారు. అసలు ధర్మాన ప్రసాదరావును ఒక ఎమ్మెల్యేగా కూడా పరిగణించలేదు. దీంతో సమయం కోసం వేచిచూసిన ధర్మాన ప్రసాదరావుకు మళ్లీ అమాత్యయోగం వచ్చింది. సీఎం జగన్ కు ధర్మాన ప్రసాదరావుపై నమ్మకం లేకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో పదవి ఇచ్చారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాంపై రివేంజ్ కు ధర్మాన సన్నద్ధమవుతున్నారు. జిల్లాకు వచ్చి తానేమిటో చూపిస్తానని ఇప్పటికే హెచ్చరికలు పంపారు కూడా. మంత్రి పదవిని ఆశించిన తమ్మినేని తాను ఈ రాష్ట్రానికే ప్రథమ పౌరుడునని ఇప్పుడు తెగ బిల్డప్ ఇస్తున్నారు. తనను కాదని ధర్మాన ప్రసాదరావును మంత్రవర్గంలోకి తీసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆయన ప్రస్టేషన్ లో ఏవేవో మాట్లాడేస్తున్నారు. సిక్కోలులో పెద్ద యుద్ధమే ప్రారంభం కానుందన్నమాట.

పాపం అనిల్ కుమార్ యాదవ్

Anil Kumar Poluboina
Anil Kumar Poluboina

మన మాజీ నోటి పారుదల శాఖ.. అదేనండి తాజా మాజీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా తెగ ప్రస్టేషన్ లోకి వెళ్లిపోయారు. ఆ 11 మందిని కొనసాగించి వీర విధేయుడునైన తనను పక్కన పెట్టడంపై తన భగవంతుడిపైనే ఆగ్రహంతో ఉన్నారు. తనను పక్కనపెట్టడం కంటే.. తన ప్రత్యర్థి అయిన కాకాని గోవర్థనరెడ్డి ఎక్కడ రివేంజ్ కు దిగుతారోనన్న బెంగ ఆయన్ను వెంటాడుతోంది. తొలి మంత్రివర్గంలో అనిల్ ను తీసుకోవడంతో పాటు నీటి పారుదల శాఖ మంత్రిత్వంతో పాటు ‘నోటి పారుదల’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ అది మూడేళ్ల పదవి అని తెలుసుకోని మన అనిల్ అయినదానికి కానిదానికి విపక్ష నేతలపై వీర లెవల్ లో విరుచుకుపడేవారు.

తన భగవంతుడు అయిన జగన్ ఇచ్చిన టాస్కును ఇట్టే పూర్తిచేసేవారు. పదునైనా మాటలతో, అవసరమైతే బూతులు జోడించి రక్తి కట్టించేవారు. శాఖ గురించి అడిగితే అమ్మనా బూతులు తిట్టేవారు. చివరకు మీడియాను సైతం తూలనాడేవారు. పనిలో పనిగా నెల్లూరు రెడ్లకు కంటిమీద కునుకు లేకుండా చేసేవారు. పాపం అనిల్ కు తెలియదు. తన భగవంతుడు జగన్ రెడ్డి మనసులో ఏముందని తెలియక బొక్క బోర్లా పడ్డాడు. మాజీ అయ్యాడు. తాను వ్యతిరేకించే కాకాని అమాత్య పీఠంపై కూర్చొన్నాడు. దీంతో నెల్లూరులోనే తనకు గడ్డు రోజులు దాపురించాయని ఆందోళన చెందుతున్నాడు. తనతో మాజీలైన బూతు మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని ధ్వయం హాజరైనా.. తాను మాత్రం మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి ముఖం చాటేశారు.

ఇదేంది అనిల్ అన్న ప్రమాణస్వీకారానికి పోలేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది కానీ.. తనను తప్పించి మంత్రిగా అవకాశం కొట్టేసిన కాకాని గోవర్థనరెడ్డి తనను ఆహ్వానించ లేదని బదులిచ్చారట. అయితే మన అనిల్ అన్నకు ఇప్పుడు ప్రోటోకాల్ గుర్తొచ్చిందా అంటూ నెల్లూరు వాసులు నవ్వుకుంటున్నారట. చింత చచ్చినా పులుపు చావదన్నట్టు ఆ ప్రస్టేషన్ అంతా జనసేనాని పవన్ పై చూపిస్తున్నారట. భీమ్లా నాయక్ కాదని.. బిచ్చం నాయక్ అని మండిపడ్డారట.2024 సార్వత్రిక ఎన్నికల్లో తమకు ప్రధాన పోటీదారు తెలుగుదేశమే తప్ప… సైడ్ క్యారెక్టర్‌ లాంటి పవన్ కాదన్నారు అనిల్. పాపం అనిల్ కుమార్ యాదవ్ భగవంతుడి దెబ్బకు ఇప్పుడిప్పడే నేలకు దిగుతున్నారు.

Also Read:Hyderabad Tree City: హైదరాబాద్ ట్రీ సిటీ.. కథేంటి?

Exit mobile version