Star Hero: టాలీవుడ్ హీరోల మార్కెట్ ఇప్పుడు క్రమంగా పెరుగుతోంది. స్టార్ హీరోల సినిమాలు రికార్డులను తిరగరాస్తున్నాయి. ముఖ్యంగా కలెక్షన్ల విషయానికి వస్తే ఒక్కో సినిమాతో గత సినిమా రికార్డులను బద్దలు కొడుతున్నారు. ఒక సినిమా కలెక్షన్ల పరంగా దుమ్ము లేపితే ఆ హీరో తర్వాత సినిమాల బడ్జెట్ అమాంతం పెరిగిపోతుంది.
ప్రస్తుతం తెలుగు హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా హీరోలుగా మారిపోతున్నారు. దీంతో ఒకప్పుడు వంద కోట్ల క్లబ్ లో చేరడమే కష్టం అనుకుంటే.. ఇప్పుడు ఏకంగా రెండు వందలు, మూడు వందల కోట్ల క్లబ్ లో చేరిపోతున్నారు. ఇప్పటికీ తెలుగులో చాలామంది స్టార్ హీరోలు రూ.100కోట్ల క్లబ్ లో చేరిపోయారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, చిరంజీవి, రామ్ చరణ్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ లాంలి చాలా స్టార్ హీరోలు వంద కోట్ల క్లబ్ లో చేరిపోయారు.
Also Read: Samantha Naga Chaitanya: మీడియా ముందుకి రాబోతున్న సమంత..నాగ చైతన్య కి ఊహించని షాక్
కాగా వీరందరి కంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో పవన్ కల్యాణ్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఆయన్ను అంతలా ఆదరిస్తుంటారు అభిమానులు. అందుకే ఆయన ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. ఒక చిన్న వెలతి ఏంటంటే ఇప్పటి వరకు పవన్ రూ.100 కోట్ల క్లబ్ లో చేరలేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.
వాస్తవానికి పవన్ సినిమా వస్తుందంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. ఆయన ప్రతి సినిమా రికార్డు బిజినెస్ చేస్తుంది. అక్కడ దర్శకుడు ఎవరు, కథ ఏంటి అనే కంటే కేవలం పవన్ మార్కెట్ ఆధారంగానే సినిమా నడుస్తుందనడలంఓ అతిశయోక్తి లేదు. ఎందుకంటే చాలా సార్లు ప్లాప్ అయిన మూవీలు కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అంతలా ప్రభావితం చేస్తుంటారు పవన్.
ఇక రీ ఎంట్రీ తర్వాత పవన్ రెండు సినిమాలు చేశారు. అందులో వకీల్ సాబ్ మొదటిది. ఇది సూపర్ హిట్ అయింది. కానీ లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూసివేశారు. లేకపోతే ఆ మూవీ రూ.100 కోట్ల క్లబ్ లో చేరేదే. ఇక రీసెంట్ గా వచ్చిన భీమ్లా నాయక్ కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సారి కూడా మరో అడ్డంకి వచ్చి పడింది. అదే ఏపీలో టికెట్ల రేట్లు తగ్గింపు.
భీమ్లానాయక్ టికెట్లను పెంచనివ్వకుండా జగన్ ప్రభుత్వం అడ్డు పడింది. రెవెన్యూ అధికారులను కాపలాగా పెట్టి మరీ.. థియేటర్ల ఓనర్లను వేధించి.. చివరకు భీమ్లానాయక్ థియేటర్లు మూసుకునేలా చేసింది. అయినా కూడా ఈ మూవీ రూ.95కోట్ల షేర్ సాధించింది. ఒకవేళ ఏపీలో రేట్లు తగ్గించకుంటే.. ఈ మూవీ రూ100కోట్ల క్లబ్ లో ఈజీగా చేరిపోయేది. ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు లాంటి పాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడు. ఈ మూవీతో ఆ మార్కును అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ మూవీ తర్వాత పవన్ మార్కెట్ మరింత పెరగడం ఖాయం.
Also Read:Acharya: చిరు, చరణ్ ను భయపెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్.. ఆచార్య విషయంలో ఆందోళన