Homeలైఫ్ స్టైల్Indian Temples: ఇండియాలో రుచికరమైన ఆహారం అందించే దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా!

Indian Temples: ఇండియాలో రుచికరమైన ఆహారం అందించే దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా!

Indian Temples: భారతదేశం హిందూ సంప్రదాయాలకు పుట్టినిల్లు. హిందుత్వం అనేది మతం కాదు ఒక ధర్మం.. దీని ప్రకారం ఒక వ్యక్తి తనకు నచ్చిన దైవాన్ని ఆరాధించవచ్చు. ఈ దేవుడినే పూజించాలి, మొక్కాలి అని నిబంధనలు ఏవీ ఇక్కడ ఉండవు. భారత గడ్డపై ఎన్నో వేల దేవాలయాలు ఉన్నాయి. ఎంతో మంది ప్రజలు నిత్యం దేవాలయాలకు వెళ్లి తమ కోరికలు, కష్టాలను తీర్చాలని ప్రార్థిస్తుంటారు. చాలా ఆలయాలు ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుంటాయి. పండుగలు, జాతరలు, కుంభమేళాలు జరిగే సమయంలో ప్రభుత్వాలు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాయి. అయితే, దేశంలోని చాలా ఆలయాలు రోజు నిత్య అన్నదానం చేస్తూ నిరుపేదల ఆకలిని తీరుస్తున్నాయి. గూడు లేని చాలా మంది ఆలయాల వద్దే భోజనం చేసి అక్కడే ఎక్కడో తల దాచుకుంటుంటారు.

Indian Temples
Indian Temples

మనదేశంలో నిత్య అన్నదానం చేస్తూ నిరుపేదల కడుపు నింపుతున్న ఆలయాలు ఎక్కడెక్కడా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. కర్ణాటక రాష్ట్రంలోని అన్నపూర్ణదేవి ఆలయం (హోరనాడు)కు 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది పురాతన దేవాలయం. అన్నపూర్ణదేవి ఆలయంలో నిత్యం వేలాది మందికి రుచికరమైన భోజనం అందిస్తారు. పంజాబ్‌లోని స్వర్ణదేవాలయంలో కూడా చాలా మంది నిరుపేదలకు భోజనం అందిస్తుంటారు ట్రస్ట్ నిర్వాహకులు.

Also Read: వాటర్, ఆయిల్ ట్యాంకర్లు రౌండ్ గా ఉండటానికి కారణాలేంటి?

చపాతీతో పాటు పప్పు, కూరగాయల మెను ఉంటుంది. జమ్మూకాశ్మీర్‌లోని హోమిస్ మోనాస్టరీ అనేది అతిపెద్ద మఠాల్లో ఒకటి. ఇక్కడ ఆకలితో వచ్చిన వారికి మంచి భోజనం అందిస్తారు. ఇకపోతే ముంబైలోని ఇస్కాన్ టెంపుల్ కూడా భక్తులతో పాటు పేదలకు ఆహారం అందిస్తోంది. మహా హారతి పూర్తయ్యాక ఆహారం అందిస్తారు. షిర్డీ సాయిబాబా మందిర్ ట్రస్ట్ వారు వేల మందికి అన్నదానం చేస్తుంటారు. ఇక్కడ్ సోలార్ ఎనర్జీతో నడిచే పెద్ద వంటశాల ఉంది. 2000కు పైగా పప్పు ధాన్యపు రాశులతో వంటలు చేస్తుంటారు.

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న తిరుపతిలో నిత్యం వేలాది మంది భక్తులకు అన్నదానం చేస్తుంటారు. ఇక్కడి వంటశాల కూడా సౌరశక్తితో నడుస్తోంది. కేవలం భక్తులకు వండి పెట్టేందుకు ఇక్కడ 1100 మంది వంట చేసేవారు ఉన్నారు. ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలో కూడా భక్తులకు, పేదలకు పెద్దఎత్తున ఆహారం అందిస్తోంది. కోలకత్తాలోని దక్షిణేశ్వర్, బిహార్ లోని బాంకే బృందావన్ టెంపుల్ కూడా భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందిజేస్తుంది.

Also Read: దంతాలకు బ్రేస్‌లు అమర్చుకున్నారా.. ఆ ప్రమాదకరమైన సమస్యలు వస్తాయట!

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper